ది గ్రేట్‌ ప్లేయర్.. విమర్శకుల నోళ్లు మూయించాడు.. మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు..

Ravichandran Ashwin:భారత జట్టు దిగ్గజ స్పిన్ బౌలర్ ఆర్ అశ్విన్.. కొంతకాలం క్రితం వరకు టీమిండియా టెస్టు బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

ది గ్రేట్‌ ప్లేయర్.. విమర్శకుల నోళ్లు మూయించాడు.. మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు..
Ashwin Test

Updated on: Jan 01, 2022 | 7:00 PM

Ravichandran Ashwin:భారత జట్టు దిగ్గజ స్పిన్ బౌలర్ ఆర్ అశ్విన్.. కొంతకాలం క్రితం వరకు టీమిండియా టెస్టు బౌలర్‌గా గుర్తింపు పొందాడు. పరిమిత ఓవర్ల జట్టుకి చాలాకాలం పాటు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అశ్విన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ జట్లలో భాగమై ఉండవచ్చు కానీ ఈ పునరాగమనం అతనికి అంత సులభంగా రాలేదు. అశ్విన్ నాలుగేళ్ల పాటు జట్టులో స్థానం కోసం ప్రయత్నించాడు ఈ సమయంలో అతను నిరంతరం విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటీవల అతను తన గడ్డుకాలం గురించి మాట్లాడాడు.

‘బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బోరియా’ షోలో ఆర్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘ఒక ఆటగాడిగా చాలాసార్లు విమర్శలను ఎదుర్కొన్నాను. నీ పని అయిపోయిందని చాలా మంది ఎద్దేవా చేశారు. క్లబ్ మ్యాచ్‌లు ఆడేందుకు చెన్నై వెళ్లినప్పుడు చాలా కష్టపడ్డాను. అయితే ఈ సమయంలో కొందరు అంతర్జాతీయ కెరీర్ ముగిసినందున వచ్చి క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడని గుసగుసలాడుకోవడం విన్నాను. నేను ఇలాంటివి నిరంతరం వింటూ ఉండేవాడిని. అయితే ఇలాంటి విషయాలు కొన్నిసార్లు నవ్వు తెప్పించేవి.. కానీ కొన్నిసార్లు బాధపెట్టించేవి’ అన్నాడు.

‘గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో తన పరిస్థితి విషమంగా ఉందని అయితే నొప్పి ఉన్నప్పటికీ బౌలింగ్ చేశానని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. సిడ్నీ టెస్టుకు ముందు100 ఓవర్లు వేయాలంటే చాలా ఆలోచించాను. మొదటి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లు వేయగలరా అని అడిగారు. నేను నొప్పిని పక్కనబెట్టి బౌలింగ్ చేయగలను అని చెప్పాను. ఎందుకంటే నేను క్రికెట్ కోసం చనిపోతాను కానీ పోటీ నుంచి దూరంగా ఉండలేను’

వెదురుబొంగుల చేపల కూర ఎప్పుడైనా తిన్నారా..! ఇక్కడ చాలా ఫేమస్.. ఒక్క వర్షకాలంలో మాత్రమే..?

IBPS PO Pre Exam Result 2021: ఐబీపీఎస్‌ పీవో ఫలితాలు ఎప్పుడంటే..?

చలికాలంలో మడమల పగుళ్లు వేధిస్తున్నాయా..! ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందుతారు..