Brisbane Olympics: 132 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. రీఎంట్రీ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Cricket in Olympics: ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా తన రాబోయే ప్రణాళిక గురించి వెల్లడించింది. అందులో క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలో భాగం చేయడం తమ ఎజెండాగా పేర్కొంది.
ICC 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త. వాస్తవానికి, 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్ క్రీడలలో క్రికెట్‌ను చేర్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది సాధ్యం కాకపోతే, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) బ్రిస్బేన్‌లో జరిగే క్రీడలలో క్రికెట్‌ను చేర్చేంచుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 లో మహిళల T20 క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది ఎంతో విజయవంతం అయింది. దీంతో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని డిమాండ్లు మరోసారి మొదలయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో సహా అనేక దేశాల క్రికెట్ బోర్డులు, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లో క్రికెట్‌ను చోటు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే క్రీడల్లో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ విఫలమైనా 2032 ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 132 ఏళ్ల తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లో చేరవచ్చని తెలుస్తోంది.
ఈ నెలాఖరులో ఐసీసీ అభిప్రాయం వెల్లడి..
వాస్తవానికి, క్రికెట్‌తో సహా 8 క్రీడల జాబితా తయారు చేశారు. ఇది బహుశా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో చేరవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ నెలాఖరులో నిర్వాహకులకు తన అభిప్రాయాన్ని అందించనుంది. ముఖ్యంగా, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏదైనా కొత్త క్రీడను జోడించవచ్చు. అయితే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఆమోదం అవసరం.
1900 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్..
ఇప్పటి వరకు క్రికెట్ ఒలింపిక్స్‌లో ఒక్కసారి మాత్రమే నిర్వహించారు. నిజానికి, క్రికెట్‌ను 1900 ఒలింపిక్ క్రీడలలో చేర్చారు. ఈ ఒలింపిక్స్ కెల్ పారిస్‌లో జరిగాయి. అయితే, ఆ ఒలింపిక్స్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ జట్టు మాత్రమే పాల్గొన్నాయి. ఇంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల క్రికెట్‌ను చేర్చారు. కామన్వెల్త్ గేమ్స్ 2022 క్రికెట్ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా బంగారు పతకాన్ని గెలుచుకుంది.