Asia Cup 2023: పేరుకే ప్రారంభ మ్యాచ్.. మైదానంలో 90 శాతం సీట్లు ఖాళీ.. పాక్ బోర్డుపై మొదలైన ట్రోల్స్..

|

Aug 30, 2023 | 5:02 PM

Asia Cup 2023: టోర్నీ ద్వారా సొమ్ము చేసుకోవాలనుకున్న పాక్ బోర్డ్‌కి తొలి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఎంత తక్కువగా ఉందంటే.. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం ముల్తాన్ స్టేడియంలో దాదాపు 90 శాతం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా పాకిస్తాన్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పలువురు నెటిజన్లు చేసిన..

Asia Cup 2023: పేరుకే ప్రారంభ మ్యాచ్.. మైదానంలో 90 శాతం సీట్లు ఖాళీ.. పాక్ బోర్డుపై మొదలైన ట్రోల్స్..
PAK vs NEP; Multan Stadium
Follow us on

Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. ఈ రోజు(ఆగస్టు 30) నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ ముల్తాన్ స్టేడియంలో పాకిస్తాన్, నేపాల్ మధ్య జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీ ద్వారా సొమ్ము చేసుకోవాలనుకున్న పాక్ బోర్డ్‌కి తొలి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఎంత తక్కువగా ఉందంటే.. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం ముల్తాన్ స్టేడియంలో దాదాపు 90 శాతం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా పాకిస్తాన్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పలువురు నెటిజన్లు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. గమనించదగిన విషయం ఏమిటంటే.. ఇన్‌సైడ్ స్పోర్ట్ కూడా ‘నేపాల్‌లో సాధారణ మ్యాచ్‌లు vs పాక్‌లో ఆసియా కప్‌ ప్రారంభ మ్యాచ్’ అంటూ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ క్రమంలో ట్రోల్స్‌పై ఓ లుక్ వేద్దాం..

90 శాతం ఖాళీ.. 

ఇవి కూడా చదవండి

ఇదీ పరిస్థితి.. 

మాస్టర్‌ క్లాస్..!

క్రేజీ క్రౌడ్..

ఇదిలా ఉండగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో రంగంలోకి దిగిన పాక్ ఓపెనర్లు ఫఖార్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) నేపాల్ బౌలింగ్‌ ధాటికి వెంటనే వెనుదిరిగారు. బాబర్ అజామ్ నిలకడగా రాణిస్తున్నా మహ్మద్ రిజ్వాన్ 44 పరుగుల వద్ద రన్ఔట్‌గా వెనుదిరిగాడు. అలాగే 24 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి పాక్ 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజామ్(43), అఘా సల్మాన్(0) ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..