WTC Final 2021: ఎట్టకేలకు రెండో రోజు నుంచి సౌథాంప్టన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొదలైందని అంతా సంతోషిస్తుంటే.. ఫీల్డ్ అంపైర్ల ప్రవర్తనతో అదికాస్తా పలు విమర్శలకు దారితీస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కొద్దిసేపు వారి ప్రవర్తనతో టెన్షన్‌గా కనిపించాడు. కోహ్లీ వికెట్ విషయంలో ఇలా చేస్తారా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేస్తున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. బంతిని లెగ్ స్టంప్‌కి కాస్త దూరంగా వదిలాడు. అయితే బంతని సరిగ్గా అంచనా వేయని కోహ్లీ..ఫైన్ లెగ్ దిశగా ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు తాకకుండా నేరుగా వెళ్లి కీపర్ బీజే వాట్లింగ్ చేతిలో పడింది. అప్పుడు విరాట్ కోహ్లీ 44 పరుగుల వద్ద ఉన్నాడు. బంతి బ్యాట్‌కు తాకిందనుకొని కివీస్ టీం కోహ్లీ ఔట్ కోసం అంపైర్‌కు అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ మొదట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కు అప్పీల్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ, ఈలోపే అందరికీ షాక్ ఇస్తూ ఫీల్డ్ అంపైర్ టీవీ అంపైర్‌ను ఆశ్రయించాడు. బంతి బ్యాట్‌కు తగిలిన శబ్ధాన్ని నేను వినలేకపోయానంటూ థర్డ్ అంపైర్‌కు వివరించాడు. దీంతో విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తూ.. చేసేందేంలేక అలా ఉండిపోయాడు. థర్డ్ అంపైర్.. నాటౌట్‌గా ప్రకటించాడు.
దీంతో నెటిజన్లు కోహ్లీ విషయంలో ఇలా చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు కివీస్ రివ్యూ కోరకుండానే మీరెందుకు థర్డ్ అంపైర్‌ను కోరారంటూ విమర్శలు చేస్తున్నారు. న్యూజిలాండ్ రివ్యూ కోల్పోకుండా ఉండేందుకు వారికి సాయం చేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతకముందే ఇదే ఓవర్లో ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్‌ఎస్‌కి వెళ్లిన న్యూజిలాండ్ టీం.. రివ్యూలో విఫలమైంది. అయితే ఈసారి కోహ్లీ వికెట్ కావడంతో మరోసారి రివ్యూకి సిద్ధమయ్యారు. కానీ.. ఫీల్డ్ అంపైర్ వారికి రివ్యూ కోల్పోకుండా సహాయం చేశాడు. థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో కోహ్లీ కూడా కూల్‌గా మారిపోయాడు.
అయితే, క్రికెట్ రూల్స్ మేరకు ఫీల్డర్ క్యాచ్ పట్టిన తీరుపై అనుమానాలు ఉంటే టీవీ అంపైర్‌ని ఫీల్డ్ అంపైర్ రివ్యూ కోరవచ్చు. ఈ మ్యాచ్‌లో మాత్రం బంతి బ్యాట్‌కి తాకిందా లేదా అనే విషయంపై రివ్యూ కోరడమే క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ రూల్స్‌ని ఉల్లఘించాడని, దీంతో న్యూజిలాండ్‌కి సహాయం చేశాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సెహ్వాగ్ చురకలు అంటిస్తూ కామెంట్ చేశాడు అది కాస్తా వైరల్ గా మారింది. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించలేదు. కివీస్ టీం డీఆర్‌ఎస్ ను కోరలేదు. అయినా.. ఆటోమేటిక్‌గా రివ్యూ’ అని ఘాటుగా కామెంట్ చేశాడు.
Funny umpiring there with Virat.
No decision given by the umpire and it automatically became a review.
Tuning in to the Women’s test match for the time being , hoping for Harman and Punam to save the Test match.— Virender Sehwag (@virendersehwag) June 19, 2021
Also Read:
INDW vs ENGW: ‘డ్రా’ తో గట్టెక్కిన భారత్..! తొలి టెస్టుతో ఆకట్టుకున్న షెఫాలీ, స్నేహ్ రాణా, తానియా
వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..