Neeraj Chopra-CSK: ఆదివారం తో టోక్యో ఒలింపిక్స్ ముగియనున్నాయి. చివరి లో భారత్ కు పసిడి కలను నెరవేర్చి దేశ ప్రజల్లో సంబరాలను నింపేశాడు నీరజ్.. ఇక త్వరలో ఐపీఎల్ 2021 సీజన్ 14వ సందడి మళ్ళీ మొదలు కానుంది. దుబాయ్, అబుదాబీ, షార్జా వేదికగా మిగిలిన పోయిన మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇపప్టికే ఈ షెడ్యూల్ ను బిసిసిఐ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ సెకండ్ ఫేస్ మ్యాచ్ ల్లో మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
కాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఒలింపిక్స్ పసిడి పతకదారుడిని వినూత్నంగా గౌరవించింది. ఇప్పటికే కోటి రూపాయలు నజరానా ప్రకటించిన చైన్నై యాజమాన్యం తాజాగా నీరజ్ గౌరవార్ధం కొత్త జెర్సీని రూపొందించడానికి రెడీ అయింది. భారత్ కు బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ని విసిరిన దూరం.. 87:58 మీటర్లు. దీంతో నీరజ్ చోప్రా గౌరవార్ధం.. 8758నెంబర్ తో జెర్సీని రూపొందించనుంది. ఈ జెర్సీ ని మ్యాచ్‌లు జరిగే ప్రతి స్టేడియంకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించింది. అంతేకాదు.. ప్రతి క్రీడాకారుడి డ్రెస్సింగ్ రూమ్ లో ఈ జెర్సీని ఉంచాలని చెన్నై సూపర్ కింగ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆ జెర్సీని చూసి.. క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారని అభిప్రాయపడుతోంది.
ఒలింపిక్స్‌లో ఓ అథ్లెట్ తొలిసారిగా స్వర్ణం సాధించడం అద్భుత ఘట్టమని, దాన్ని తమ వెంటే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ జెర్సీని రూపొందించాలని నిర్ణయించామని తెలిపింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనిని భారత ఆర్మ్ అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చిన విషయాన్నీ ప్రస్తావిస్తూ.. నీరజ్ కూడా ఆర్మీలో జూనియర్ స్థాయి అధికారి అని హర్షం వ్యక్తం చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం
Also Read: 125ఏళ్ల నిరీక్షణకు తెరదించిన నీరజ్ ఎవరు ఎక్కడ నుంచి అథ్లెటిక్‌గా ప్రస్థానం ప్రారంభించాడో తెలుసా..
l