ఐపీఎల్ 2022 (IPL 2022) లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్(PBKS) టీం చెన్నై(CSK) జట్టును 11 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ముంబై వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 27 పరుగులు చేయాల్సి ఉంది. ధోనీ క్రీజులో ఉండడంతో, ముంబై మ్యాచ్ ఫలితాన్నే మరోసారి రిపీట్ చేస్తాడని అంతా భావించారు. కానీ, ధోనీ ఎంత ప్రయత్నించినా.. పంజాబ్ ఆటగాళ్లు మాత్రం సత్తా చాటడంతో చెన్నై ప్లాన్స్ ఫలించలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్ టీం 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీం కేవలం 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై తరుపున అంబటి రాయుడు (78) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడడం ఇదే తొలిసారి. 8 మ్యాచ్‌ల్లో పీబీకేఎస్‌కు ఇది నాలుగో విజయం. ఇప్పటి వరకు ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 8 మ్యాచ్‌ల్లో ఇది ఆరో ఓటమి. ఇప్పటి వరకు ఆ జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ 37 బంతుల్లో ఐపీఎల్ కెరీర్‌లో 46వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో చెన్నైపై ధావన్‌కి ఇది రెండో, 8వ 50+ స్కోరు. 59 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా ఆడాడు. ఐపీఎల్‌లో తన 200వ మ్యాచ్‌లో ఏ ఆటగాడు ఆడిన అతిపెద్ద ఇన్నింగ్స్ ఇదే కావడం విశేషం. సీఎస్‌కే తరఫున డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన 8వ ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు ఎంఎస్ ధోని (228), దినేష్ కార్తీక్ (221), రోహిత్ శర్మ (221), విరాట్ కోహ్లీ (215), రవీంద్ర జడేజా (208), సురేశ్ రైనా (205), రాబిన్ ఉతప్ప (201) పేర్లు వచ్చాయి.
చెన్నై టాప్ ఆర్డర్ మరోసారి విఫలం..
చెన్నై సూపర్ కింగ్స్ 188 పరుగుల స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగింది. అయితే, చెన్నై టాప్ ఆర్డర్ 3 వికెట్లు కేవలం 40 పరుగులకే పడిపోయాయి. 100 పరుగుల వ్యవధిలో నాలుగో దెబ్బ కూడా పడింది. అయితే 5వ వికెట్‌కు రాయుడు, జడేజా మధ్య అర్ధసెంచరీ భాగస్వామ్యం కొంత ఆశాజనకంగా అనిపించింది. 200 స్ట్రైక్ రేట్‌తో కేవలం 39 బంతుల్లో 78 పరుగులు చేసిన అంబటి రాయుడు క్లీన్ బౌల్డ్ కావడం ద్వారా ఈ కీలక భాగస్వామ్యానికి బ్రేకులు పడ్డాయి. దాంతోనే చెన్నై ఆశలు కూడా ఆవిరయ్యాయి.
రాయుడు ఔట్ కాగానే జడేజాకు మద్దతుగా ధోనీ క్రీజులోకి వచ్చాడు. ధోనీ క్రీజులో ఉండడంతో.. మునుపటి రిజల్టే రిఫీట్ అవుతుందని అంతా అనుకున్నారు. చెన్నై విజయానికి 8 బంతుల్లో 32 పరుగులు అవసరం. దీంతో భారీ షాట్లు ఆడి చివరి 6 బంతుల్లో 27 పరుగులకు చేర్చాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన రిషి ధావన్ తొలి బంతికే సిక్సర్ బాదడంతో ఆశ మరింత పెరిగింది. ఒత్తిడిలో ఉన్న రిషి ధావన్ తర్వాతి బంతిని వైడ్‌గా వేశాడు. దాంతో చెన్నై విజయానికి మరో 5 బంతుల్లో 20 పరుగులు అవసరం అయ్యాయి. ఆ తర్వాతి బంతికే ధోనీ ఔట్ కావడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో పంజాబ్ విజయం ఖాయమైంది. దీంతో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. అంబటి రాయుడు (78) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జట్ల వివరాలు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, ముకేశ్ చౌదరి, మహీశా తీక్షణ
పంజాబ్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోమ్, జితేశ్ శర్మ, భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: PBSK vs CSK Highlights, IPL 2022: 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.. పోరాడి ఓడిన చెన్నై..
IPL 2022: సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టేశాడు.. కానీ 24 లక్షల ఫైన్ కూడా కట్టాడు..!