CSK Playoff Scenario: 7 మ్యాచ్‌ల్లో ఓడినా చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఇలా జరిగితే, ధోనిసేనను ఆపేది ఎవరు?

CSK Playoff Qualification Scenario IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దారుణంగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో చెన్నై ఇప్పుడు ఐపీఎల్ 2025లో ఏడో ఓటమిని ఎదుర్కొంది. ఈ సీజన్‌లో మరో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ముందున్న పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

CSK Playoff Scenario: 7 మ్యాచ్‌ల్లో ఓడినా చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఇలా జరిగితే, ధోనిసేనను ఆపేది ఎవరు?
Csk Team

Updated on: Apr 26, 2025 | 7:12 AM

Chennai Super Kings Playoff Qualification Scenario IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తొమ్మిదవ మ్యాచ్‌లో ఏడో ఓటమిని చవిచూసింది. దీంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లే మార్గం చెన్నైకి చాలా కష్టమైంది. ధోని నేతృత్వంలోని చెన్నైకి ఐపీఎల్ 2025 సీజన్ దాదాపు ముగిసినట్లే. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలను ఇంకా తెరిచి ఉంచుకుంది.

చెన్నై పని క్లోజ్..

చెన్నై సూపర్ కింగ్స్ గురించి చెప్పాలంటే, IPL 2025 సీజన్ తొమ్మిదవ మ్యాచ్‌లో ఏడో ఓటమి ఎదురైంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో పాటు, మిగిలిన ఐదు మ్యాచ్‌లలో గెలిచినా, చెన్నై గరిష్టంగా 14 పాయింట్లను చేరుకోగలదు. ఈ పరిస్థితిలో చెన్నై ఇతర జట్లపై ఆధారపడాల్సి వస్తుంది. మిగిలిన ఐదు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. తద్వారా నెట్ రన్ రేటును -1.302 ను మెరుగుపరచవచ్చు. లేకపోతే చెన్నై నిష్క్రమణ దాదాపు ఖాయమైనట్టే.

చెన్నైకి కలసిరాని ఐపీఎల్ 2025..

ఐపీఎల్ 2025 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏమాత్రం కలసిరాలేదు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా మొదటి కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో కూడా చెన్నై జట్టు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. చెన్నై జట్టు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది. చెన్నై జట్టు తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 30న ఫామ్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

ఇవి కూడా చదవండి

IPL 2025 43వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక..

1) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 8, గెలుపు – 6, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 12, నెట్ రన్ రేట్ – +1.104)

2) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 8, గెలుపు – 6, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 12, నెట్ రన్ రేట్ – +0.657)

3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 6, ఓడినవి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 12, నెట్ రన్ రేట్ – +0.482)

4) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 5, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 10, నెట్ రన్ రేట్ – +0.673)

5) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 8, గెలుపు – 5, ఓడినవి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 10, నెట్ రన్ రేట్ +0.177)

6) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 5, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 10, నెట్ రన్ రేట్ – -0.054)

7) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 8, గెలుపు – 3, ఓడినవి – 5, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – +0.212)

8) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 3, ఓడినవి – 6, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – -1.103)

9) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 2, ఓటమి – 7, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -0.625)

10) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 2, ఓటమి – 7, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -1.302).

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..