CSK New Coach: ఇది కదా పోటీ అంటే.. చెన్నై కొత్త కోచ్ రేసులో ఐదుగురు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..!

Chennai Super Kings New Coach: స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు రాబోయే కొత్త కోచ్ ఎవరైనా సరే, వారి ముందున్న అతిపెద్ద సవాలు ఒక్కటే.. నిలకడలేమితో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్లడం, పసుపు సైన్యాన్ని విజయపథంలో నడిపించడం. మరి ఈ గురుతర బాధ్యతను యాజమాన్యం ఎవరికి అప్పగిస్తుందో చూడాలి!

CSK New Coach: ఇది కదా పోటీ అంటే.. చెన్నై కొత్త కోచ్ రేసులో ఐదుగురు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..!
Chennai Super Kings New Coach

Updated on: Jul 14, 2026 | 7:14 AM

Chennai Super Kings New Head Coach: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఊహించని నిర్ణయంతో క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. గత 18 ఏళ్లుగా జట్టుకు వెన్నెముకగా నిలిచిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై యాజమాన్యం వేటు వేసింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో సరికొత్త వ్యూహాలతో జట్టును ప్రక్షాళన చేసేందుకు సీఎస్కే సిద్ధమవడంతో ఇప్పుడు కొత్త కోచ్ ఎవరనే ఉత్కంఠ రేకెత్తుతోంది.

చెన్నై సామ్రాజ్యంలో ముగిసిన ఒక శకం.. ఫ్లెమింగ్‌పై వేటుకు అసలు కారణం ఇదే..!

చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో స్టీఫెన్ ఫ్లెమింగ్ పాత్ర సామాన్యమైనది కాదు. ఎంఎస్ ధోనీతో కలిసి పద్దెనిమిదేళ్ల పాటు పసుపు జెండాను ఐపీఎల్ వేదికలపై రెపరెపలాడించిన ఘనత అతడిది. ఫ్లెమింగ్ పర్యవేక్షణలోనే చెన్నై జట్టు ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లను ముద్దాడింది. అయితే ఎంతటి చరిత్ర ఉన్నప్పటికీ, వర్తమానంలో ఫలితాలు రానప్పుడు మార్పులు తప్పవని సీఎస్కే యాజమాన్యం నిరూపించింది.

ఇదికూడా చదవండి: కొంపముంచిన 7 మ్యాచ్‌లు.. 2028 టీ20 ప్రపంచకప్‌ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?

గత మూడు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ కనీసం ప్లేఆఫ్స్ దశకు కూడా చేరుకోలేకపోయింది. ఆధునిక టీ20 క్రికెట్ శరవేగంగా మారిపోతోంది. సరికొత్త పద్ధతులు, డేటా విశ్లేషణలు, దూకుడు వ్యూహాలతో ప్రత్యర్థి జట్లు దూసుకుపోతుంటే, చెన్నై పాత చింతకాయ పచ్చడి వ్యూహాలతోనే బరిలోకి దిగుతోందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫ్లెమింగ్ వద్ద ఆధునిక క్రికెట్‌కు తగ్గ సరికొత్త ఆలోచనలు కొరవడ్డాయని భావించిన యాజమాన్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

చెన్నై కొత్త బాస్ ఎవరు? రేసులో నిలిచిన ఆ ఐదుగురు వీరే..!

ఫ్లెమింగ్ నిష్క్రమణతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని అధిరోహించేందుకు పలువురు దిగ్గజాలు, యువ క్రికెటర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఐదుగురి పేర్లపైనే జోరుగా చర్చ నడుస్తోంది.

1. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)

క్రికెట్ అభిమానుల గుండెల్లో ‘సీఎస్కే అంటే ధోనీ.. ధోనీ అంటేనే సీఎస్కే’. ఇన్నాళ్లూ మైదానంలో ఆటగాడిగా, కెప్టెన్‌గా ఉంటూనే తెరవెనుక కోచ్ బాధ్యతలను కూడా ధోనీనే చూసుకున్నాడు. ఇప్పుడు అధికారికంగా హెడ్ కోచ్ పదవిని ధోనీకి అప్పగిస్తే, అంతకంటే పర్ఫెక్ట్ ఛాయిస్ మరొకటి ఉండదని అభిమానులు భావిస్తున్నారు. యాజమాన్యం కూడా మొదట ధోనీ అభిప్రాయాన్నే తీసుకోనుంది.

ఇదికూడా చదవండి: టీమిండియాలో ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ సిరీస్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్..?

2. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)..

భారత జట్టుకు ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌ను అందించిన ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ పేరు కూడా ఈ రేసులో బలంగా వినిపిస్తోంది. ప్రణాళికాబద్ధమైన వ్యూహాలు, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడం, డేటా ఆధారిత విశ్లేషణల్లో ద్రవిడ్ దిట్ట. ద్రవిడ్ గనుక కోచ్‌గా వస్తే చెన్నై జట్టుకు సరికొత్త ఊపు రావడం ఖాయం.

3. రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)..

ఇది కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ స్పిన్ దిగ్గజం అశ్విన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చెన్నై మాజీ ఆటగాడైన అశ్విన్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవంతో పాటు ఆధునిక క్రికెట్‌పై అద్భుతమైన పట్టు ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘ కాలం జట్టును నడిపించేందుకు అశ్విన్ సరైన ప్రత్యామ్నాయం కాగలడు.

ఇదికూడా చదవండి: Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?

4. దినేశ్ కార్తీక్ (Dinesh Karthik)..

తమిళనాడుకు చెందిన మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆర్సీబీ మెంటార్‌గా పనిచేసిన అనుభవం ఇతనికి ఉంది. స్థానిక క్రికెటర్ కావడం వల్ల తమిళ అభిమానులతో బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కార్తీక్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

5. హేమంగ్ బదానీ (Hemang Badani)..

ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కోచ్, మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే గతంలో బదానీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ఫ్లెమింగ్ అంత గొప్ప కోచ్ అయితే సీఎస్కే కాకుండా వేరే ఏ జట్టునూ ఎందుకు గెలిపించలేకపోయాడు? చెన్నై గెలుపునకు అసలు కారణం ధోనీనే” అని అప్పట్లో బదానీ అనడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us