ఐపీఎల్ 2022 మెగా వేలం(IPL Auction 2022)లో చెన్నై సూపర్ కింగ్స్ కీలకంగా వ్యవహరిస్తోంది. ధోనీ కెప్టెన్సీతోపాటు అద్భుతమైన ప్లేయింగ్ XI కాంబినేషన్ కారణంగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై.. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచింది. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఉత్తమ జట్టును నిర్మించేందుకు తెగ కష్టపడుతోంది. దాని కోసం IPL మెగా వేలంలో బలమైన, సమర్థవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడం అవసరం. IPL 2022 వేలంలో రాబిన్ ఉతప్ప రూపంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings Players List) మొదటి కొనుగోలు చేసింది. ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ బేస్ ప్రైస్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు కూడా చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి వచ్చారు.
చెన్నై సూపర్ కింగ్స్ 4 ఆటగాళ్లను రిటైన్ చేసింది. ఇందులో మొదటి పేరు రవీంద్ర జడేజాదే. ఈ ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ బంతితో, బ్యాట్‌తో మ్యాచ్‌లను గెలవగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. గత 2-3 సంవత్సరాలలో, జడేజా తన బ్యాటింగ్ బలంతో చాలా మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని నంబర్ వన్‌గా ఉంచడానికి ఇదే కారణం. జడేజాను అట్టిపెట్టుకోవడానికి చెన్నై రూ.16 కోట్లు చెల్లించింది. జడేజా తర్వాత ధోనీని రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్నాడు. చెన్నై జట్టు ధోనీ చుట్టూ తిరుగుతోంది. అతనే కెప్టెన్, అలాగే మెగా వేలంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని కూడా చెన్నై అట్టిపెట్టుకుంది. మొయిన్ అలీ IPL 2021 కోసం మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. బంతితోనూ, బ్యాటింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచిన మొయిన్‌పై చెన్నై విపరీతమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఐపీఎల్ 2021లో ఆరెంజ్ క్యాప్ విజేత రితురాజ్ గైక్వాడ్‌ను కూడా జట్టు తన వద్దే ఉంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు..
రవీంద్ర జడేజా – రూ.16 కోట్లు
ఎంఎస్ ధోని – రూ.12 కోట్లు
మొయిన్ అలీ – రూ.8 కోట్లు
రితురాజ్ గైక్వాడ్ – రూ. 6 కోట్లు
రాబిన్ ఉతప్ప – రూ.2 కోట్లు
డ్వేన్ బ్రావో – రూ. 4.40 కోట్లు
అంబటి రాయుడు – రూ.6.75 కోట్లు
దీపక్ చాహార్ – రూ. 14 కోట్లు
Also Read: IPL 2022 Auction: తగ్గేదేలే.! మెగా వేలంలో దుమ్ముదులిపిన యువ ప్లేయర్స్.. సీనియర్లకు నిరాశ..
Gujarat Titans IPL 2022 Auction: గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!