IPL 2022: ఐపీఎల్ 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఈ సీజన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. గత సంవత్సరం ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు ఈసారి ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. దీనికి చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమాధానమిచ్చారు. ఈ ఐపీఎల్‌లో తమ జట్టు ఆశించిన మేరకు రాణించలేకపోయిందని అభిప్రాయపడ్డాడు.IPLలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన CSK ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలతో సరిపెట్టుకుంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత కోచ్ ఫ్లెమింగ్ ఈ విధండా మాట్లాడాడు.
“మేమే ఈ సీజన్‌లో చాలా తక్కువ మ్యాచ్‌లు గెలిచాం. ప్లే ఆఫ్‌కి అర్హత సాధించలేకపోయాం. కొత్త ఆటగాళ్లు మునుపటి సీజన్ మాదిరి ఆడలేకపోయారు. అందుకే గత నాలుగేళ్ల ఆటతీరుని కొనసాగించలేకపోయాం. ఇది నిజంగా ఒక సవాలు లాంటిది. అయితే ఈ అనుభవం వచ్చే ఏడాది జట్టుకు ఉపయోగపడుతుంది. మాకు విజయాలు అందజేయగల, జోరును కొనసాగించగల ఆటగాళ్లు ఎక్కువగా లేరు. మేము మెరుగ్గా ఆడేందుకు అవకాశం ఉంది. కానీ ఆశించినంత మేర రాణించలేకపోయాం. ఈ అనుభవం వచ్చే ఏడాది మాకు సహాయపడుతుంది’ అని చెప్పాడు.
ఈ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కి కలిసిరాలేదు. మొదటి నాలుగు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయింది. తర్వాత బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలను మాత్రమే ఓడించగలిగింది. మొత్తం సీజన్‌లో 400 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జట్టులో కనిపించకపోవడం విడ్డూరం. బహుశా చెన్నై వైఫల్యానికి ఇదే అతిపెద్ద కారణమై ఉంటుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి