ఐస్‌క్రీమ్ పేరుతో బయటకు.. కట్‌చేస్తే.. మైదానం మధ్యలో కారు ఆపి ప్రపోజ్.. రోహిత్ లవ్‌స్టోరీ అదుర్స్

Rohit Sharma and Ritika Sajdeh Love Story: ఐస్‌క్రీమ్ పేరుతో ఇంత రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడా అని ఆశ్చర్యపోతూ, రోహిత్ ప్రేమ కథ గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు.

ఐస్‌క్రీమ్ పేరుతో బయటకు.. కట్‌చేస్తే.. మైదానం మధ్యలో కారు ఆపి ప్రపోజ్.. రోహిత్ లవ్‌స్టోరీ అదుర్స్
Rohit Sharma Love Story

Updated on: Jun 23, 2025 | 9:44 PM

Rohit Sharma and Ritika Sajdeh Love Story: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అతని సతీమణి రితికా సజ్దేల ప్రేమ కథ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా రోహిత్ శర్మ తన ప్రేమ ప్రయాణాన్ని, రితికకు ఎలా ప్రపోజ్ చేశాడో వివరిస్తూ, అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఐస్‌క్రీమ్ పేరుతో రితికను బయటికి తీసుకెళ్లి, తన చిన్ననాటి క్రికెట్ గ్రౌండ్‌లో ప్రపోజ్ చేసిన విధానం వైరల్‌గా మారింది.

స్నేహం నుంచి ప్రేమగా..

రోహిత్ శర్మ, రితికా సజ్దేల పరిచయం మొదట ఒక యాడ్ షూట్ సమయంలో జరిగింది. రితికా అప్పట్లో రోహిత్‌కు మేనేజర్‌గా పనిచేస్తుండేది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట, 2015లో పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. యువరాజ్ సింగ్‌కు రితికా సోదరి వరస అవుతుందని, అందుకే రోహిత్ రితికాకు దూరంగా ఉండాలని యువీ హెచ్చరించిన సంఘటనలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.

ఇవి కూడా చదవండి

అభిమానులను ఆశ్చర్యపరిచిన ప్రపోజల్ స్టోరీ..!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, రితికాకు తాను ఎంత రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశానో వివరించాడు. తన కెరీర్ ప్రారంభమైన చోటే, అంటే తను చిన్నప్పుడు క్రికెట్ ఆడుకున్న మైదానంలోనే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. “ఒక రోజు సాయంత్రం, రితికా నాకు ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చింది. మేమిద్దరం మెరీన్ డ్రైవ్‌లో కూర్చుని మాట్లాడుకుంటూ తినేశాం. ఆ తర్వాత నాకు బోర్ కొడుతుందని, ఐస్‌క్రీమ్ తినడానికి బయటకు వెళ్దామని అడిగాను. ఆమెను కారులో ఎక్కించుకుని బయల్దేరాం. మెరీన్ డ్రైవ్, హాజీ అలీ, వర్లీ వంటి ప్రాంతాలు దాటి వెళ్తుంటే, రితికా ‘ఐస్‌క్రీమ్ షాప్ ఎక్కడుంది?’ అని అడిగింది. బాంద్రా తర్వాత ఆమెకు ముంబై గురించి పెద్దగా తెలియదు. అప్పుడు నేను బోరీవాలిలో ఒక మంచి ఐస్‌క్రీమ్ షాప్ ఉందని, తను ఎప్పుడూ రాలేదని, చూపించాలని చెప్పాను. నిజానికి అది నా చిన్ననాటి క్రికెట్ గ్రౌండ్. నేను నా స్నేహితులకు ముందే చెప్పి, అక్కడ కొన్ని ఏర్పాట్లు చేయించాను. గ్రౌండ్ చాలా చీకటిగా ఉండడంతో, ఆమెకు అది క్రికెట్ గ్రౌండ్ అని కూడా తెలియదు. కారు పార్క్ చేసి, నేను ఆమెను నేరుగా పిచ్ మధ్యలోకి తీసుకెళ్లాను. అక్కడ మోకాళ్లపై కూర్చుని ఆమెకు నా ప్రేమను వ్యక్తం చేశాను” అని రోహిత్ శర్మ చెప్పాడు.

ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోయారు. ఐస్‌క్రీమ్ పేరుతో ఇంత రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడా అని ఆశ్చర్యపోతూ, రోహిత్ ప్రేమ కథ గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రోహిత్ శర్మ, ప్రస్తుతం తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఈ సంఘటన రోహిత్ వ్యక్తిగత జీవితంపై అభిమానులకు మరింత ఆసక్తిని పెంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..