Royal Challengers Bangalore: కోహ్లీ కళ నెరవేరేనా? ప్లేఆఫ్ చేరాలంటే ఇలా జరగాల్సిందే.. లేదంటే..

|

May 12, 2023 | 1:59 PM

RR vs RCB: బెంగళూరుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో మే 14 ఆదివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

Royal Challengers Bangalore: కోహ్లీ కళ నెరవేరేనా?  ప్లేఆఫ్ చేరాలంటే ఇలా జరగాల్సిందే.. లేదంటే..
Royal Challengers Bangalore
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ 16వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఒక జట్టు ఓటమి-గెలుపు, మరో జట్టు భవితవ్యాన్ని మార్చేస్తున్నాయి. మరికొన్ని జట్లు + రన్ రేట్ కోసం కష్టపడుతున్నాయి. ఈ క్రమంలో మరో 14 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అయితే, ఇప్పటికీ కొన్ని జట్లు ప్లే ఆఫ్స్ చేరేందుకు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా దిగ్గజాలతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తిప్పలు తప్పేలా లేవు. ఐపీఎల్ 2023లో తొలి కప్ గెలవాలనే ఆశతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఈసారి కూడా కష్టాల్లో పడింది. ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించాలంటే ఆర్సీబీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది.

బెంగళూరుకు ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో మే 14 ఆదివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

రాజస్థాన్‌తో మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ సహా RCB ఆటగాళ్లందరూ గురువారం జైపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి హార్డ్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

RCB ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాలంటే, తదుపరి మూడు మ్యాచ్‌లలో గెలిస్తే సరిపోదు. భారీ తేడాతో గెలుపొందడమే కాక + రన్ రేట్‌కి తిరిగి రావాల్సి ఉంది. అలాగే మే 14న CSKతో జరిగే మ్యాచ్‌లో KKR ఓడిపోవాలి. అలాగే లక్నో సూపర్ జెయింట్ కూడా 1 మ్యాచ్‌లో ఓడిపోతుందని ఎదురుచూడాలి.

ఇలా, కొన్ని లెక్కల ద్వారా RCB ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించే అవకాశం ఇప్పటికీ సజీవంగా ఉంది. అయితే ఈ లెక్కలన్నీ బెంగళూరు తదుపరి మూడు మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తుందనే దానిపై ఆధారపడి ఉన్నాయి.

మే 14న RRతో RCB తలపడనుంది. 18న హైదరాబాద్‌తో సన్‌రైజర్స్ ఆడనుంది. ఆ తర్వాత లీగ్‌లోని చివరి మ్యాచ్‌ను 21న గుజరాత్ టైటాన్స్‌తో RCB ఆడనుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ ఆరో స్థానంలో ఉంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కేకేఆర్‌ ఓడిపోవడంతో ఆర్‌సీబీ ఒక స్థానం ఎగబాకింది. ఆడిన మొత్తం పదకొండు గేమ్‌లలో 10 పాయింట్లు, -0.345రన్ రేట్‌తో నిలిచింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి, ఆరింటిలో ఓడిపోయింది.