Punjab Kings: ఇదెక్కడి లెక్క రా సామీ.. గెలిచినా, ఆ 2 జట్ల చేతిలోనే పంజాబ్ ఫ్యూచర్..

Punjab Kings playoffs scenario: ఐపీఎల్ 2026 లీగ్ దశ తారాస్థాయికి చేరుకుంది. అయితే, ప్లేఆఫ్స్‌లో నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) భవితవ్యం ఇప్పుడు చివరి వారాంతపు మ్యాచ్‌లపై ఆధారపడి ఉంది. దీని ప్రకారం, పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Punjab Kings: ఇదెక్కడి లెక్క రా సామీ.. గెలిచినా, ఆ 2 జట్ల చేతిలోనే పంజాబ్ ఫ్యూచర్..
Punjab Kings

Updated on: May 23, 2026 | 12:56 PM

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, మరో మూడు జట్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. దీంతో నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

ఈ పోటీలో పంజాబ్ కింగ్స్ జట్టు నేడు (మే 23) లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, పంజాబ్ జట్టుకు మొత్తం 15 పాయింట్లు లభిస్తాయి. అయితే, పంజాబ్ కింగ్స్ జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించదు. ఎందుకంటే, మిగిలిన రెండు జట్ల ఫలితాల కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. దీని ప్రకారం, పంజాబ్ జట్టు ప్లేఆఫ్ లెక్కింపు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఒకవేళ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్‌జెయింట్స్‌పై గెలిస్తే, అప్పుడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే, పంజాబ్ కింగ్స్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉంటుంది.

ఒకవేళ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్‌జెయింట్స్‌పై, ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌పై గెలిస్తే, పంజాబ్ మరో మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అదేమిటంటే, ఐపీఎల్ 69వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తప్పక గెలవాలి.

దీని అర్థం ఏమిటంటే, లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలిచిన తర్వాత, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పనిసరిగా ఓడిపోవాలి. అటువంటి ఫలితం సాధిస్తేనే, పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అందువల్ల, పంజాబ్‌కు నేటి మ్యాచ్ మాత్రమే కాకుండా, ఇతర జట్ల తదుపరి మ్యాచ్‌లు కూడా కీలకం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us