ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధర పలికిన సంగతి తెలిసిందే. లక్నో పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వార్త తెలిసిన దగ్గరి నుంచి చాలా మందికి ఓ సందేహం వచ్చింది ఉంటుంది. రిషబ్ పంత్‌కు రూ.27కోట్లు ఆన్ హ్యాండ్ వస్తుందా అని అందరీ డౌట్ కచ్చితంగా వచ్చే ఉంటుంది. వాస్తవానికి పంత్ చేతికి రూ.27 కోట్లు రాదు.. రూ.27 కోట్లలో రూ.8.1 కోట్లు పన్నులకు పోగా పంత్ చేతికి రూ. 18.9 కోట్లు మాత్రమే అందుతాయి. అయితే పంత్ టోర్నీకి ముందు గాయపడితే డబ్బు రాదు. అలాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నా కూడా డబ్బు ఇవ్వరు. టోర్నీ మధ్యలో గాయపడి మిగితా మ్యాచ్లకు దూరమైతే మాత్రం డబ్బు చెల్లిస్తారు. ఇక భారత్ మ్యాచ్‌లకు ఆడుతూ గాయపడితే డబ్బు చెల్లిస్తారు.
ఇది చదవండి: ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుందిగా..!
ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వక పోస్ట్‌తో ఢీల్లీ ఫ్రాంచైజీకి వీడ్కోలు పలికాడు. పంత్ ఢీల్లీ ఫ్రాంచైజీతో తన 9 సంవత్సరాల ప్రయాణం గురించి గుర్తుచేసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరడానికి ముందు అభిమానులకు వీడ్కోలు చెప్పాడు. LSG ఢిల్లీ క్యాపిటల్స్ RTMను రూ. 20.75 కోట్లతో అధిగమించిన తర్వాత, పంత్ లక్నోకు చెందిన రూ. 27 కోట్ల రికార్డు రుసుముతో జట్టులో చేరాడు. మెగా-వేలంలో ఈ వికెట్ కీపర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎల్‌ఎస్‌జీ, డీసీలు పోటిపడ్డాయి. RCB పంత్‌ను రూ. 11 కోట్లతో వదులుకోగా, ఎల్‌ఎస్‌జీ, ఎస్‌ఆర్‌హెచ్ రూ. 20.50 కోట్ల వరకు బిడ్డింగ్ వార్ సాగాయి.ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ డ్రాప్ అవుట్ అయింది. ఢిల్లీ చివరి నిమిషంలో తమ రైట్ టు మ్యాచ్‌ని వినియోగించుకునేందుకు ప్రయత్నించింది. చివరికి LSG రికార్డు వేలం రూ. 27 కోట్లతో పంత్‌ను కొనుగోలు చేసింది.
ఇది చదవండి: క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు.. కారణం అదేనా?
మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్‌ను వదులుకున్న లక్నో జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉంటాడని అందరూ భావిస్తున్నారు. గత సీజన్‌లో టాప్ ఆర్డరే విఫలమవ్వడంతో తర్వాత వచ్చే బ్యాట్సమెన్లు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో పంత్‌పైనే ఎల్‌ఎస్‌సీ భారీ అంచనాలు పెట్టుకుంది. 2021 నుండి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, 43 మ్యాచ్‌లలో జట్టును నడిపించాడు. 54.65% సక్సస్ రేటుతో 23 విజయాలు సాధించాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పగ్గాలు పంత్ చేపడుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విషయంపై LSG నుండి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పంత్ జట్టు కెప్టెన్సీని చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
LSG IPL 2025 జట్టు: నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 7.5 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2 కోట్లు), మిచెల్ మార్ష్ ( రూ. 3.40 కోట్లు), అవేష్ ఖాన్ (రూ. 9.75 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ. 4.20 కోట్లు), ఆర్యన్ జుయల్ (రూ. 30 లక్షలు), ఆకాష్ దీప్ (రూ. 8 కోట్లు), హిమ్మత్ సింగ్ (రూ. 30 లక్షలు), ఎం. సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు), దిగ్వేష్ సింగ్ (రూ. 30 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు), ఆకాష్ సింగ్ (రూ. 30 లక్షలు), షామర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు), ప్రిన్స్ యాదవ్ (రూ. 30 లక్షలు), యువరాజ్ చౌదరి (రూ. 30 లక్షలు), రాజవర్ధన్ హంగర్గేకర్ (రూ. 30 లక్షలు), అర్షిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు), మాథ్యూ బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు).
ఇది చదవండి: ముంబై వద్దంది..కట్ చేస్తే.. ఆర్సీబీ కోటి ఎక్కువ పెట్టి మరీ కొనుగోలు చేసింది..!
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి