IPL 2025: రూ. 82.25 కోట్లు ఖర్చు చేసినా.. ఆ 3 బలహీనతలు దాటని ఆర్‌సీబీ.. ఈసారి కూడా ట్రోఫీ మిస్సేగా?

|

Mar 19, 2025 | 9:11 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోల్‌కతాలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అయితే, గత సీజన్ల వలె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈసారి రూ. 82.25 కోట్లు ఖర్చు చేసినా, 3 బలహీనతలను మాత్రం అధిగమించలేకపోయింది.

IPL 2025: రూ. 82.25 కోట్లు ఖర్చు చేసినా.. ఆ 3 బలహీనతలు దాటని ఆర్‌సీబీ.. ఈసారి కూడా ట్రోఫీ మిస్సేగా?
Royal Challengers Bengaluru
Follow us on

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. RCB ప్రతి సీజన్‌లో అందరినీ అలరిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఆ ఫ్రాంచైజీ ఇంకా తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. RCB తన తొలి మ్యాచ్‌ను మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్ అంటే KKRతో ఆడనుంది. మెగా వేలంలో, RCB తన కొత్త జట్టును ఏర్పాటు చేసి రూ. 82.25 కోట్లు ఖర్చు చేసిందనే సంగతి తెలిసిందే. అయితే, IPL 2025 ప్రారంభానికి ముందు, ఈసారి కూడా బెంగళూరు ఆటను పాడు చేయగల మూడు బలహీనతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జోష్ హేజిల్‌వుడ్ తప్ప మరొ విదేశీ తుఫాన్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం..

జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు, ఆర్‌సీబీలో విదేశీ ఫాస్ట్ బౌలర్లుగా నువాన్ తుషార, రొమారియో షెపర్డ్, లుంగీ న్గిడి ఉన్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్ల ప్రభావం జోష్ హేజిల్‌వుడ్‌లా ప్రభావం చూపించలేరు. హేజిల్‌వుడ్ ఒంటరిగా RCB తరపున మ్యాచ్ గెలవగలడు. కానీ, ఈ ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇలా చెప్పడం కష్టం.

ఆల్ రౌండర్లు లేకపోవడం..

ఆర్‌సీబీ ఆల్ రౌండర్ల జాబితాలో కృనాల్ పాండ్యాకు కీలక పేరు ఉంది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ సంచలనం సృష్టించగలడు. ఇక రెండు విభాగాలలోనూ బాగా రాణించగల మరో ఆల్ రౌండర్ ఆర్‌సీబీ వద్ద లేడు. ఇది RCB అతిపెద్ద బలహీనత. బెంగళూరు జట్టులో కృనాల్ పాండ్యా తప్ప మరెవరూ మంచి భారత ఆల్ రౌండర్ లేరు.

ఇవి కూడా చదవండి

అనుభవజ్ఞులైన స్పిన్నర్లు లేరు..

ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మంచి స్పిన్నర్లు లేరు. సుయాష్ శర్మ అనే ఒకే ఒక ప్రసిద్ధ స్పిన్నర్ ఉన్నాడు. అయితే, అతనికి పెద్దగా అనుభవం కూడా లేదు. ఐపీఎల్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. బెంగళూరు జట్టుకు మంచి స్పిన్నర్ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..