Jasprit Bumrah : ఒక్కో బంతికి అక్షరాలా రూ.6.45 లక్షల ఖర్చు.. బుమ్రా బౌలింగుతో ముంబైకి రూ.1.55 కోట్ల నష్టం

Jasprit Bumrah : బుమ్రా ఏడాదికి రూ.18 కోట్లు తీసుకుంటాడు. అంటే సగటున ఒక మ్యాచ్‌కు అతనికి రూ.1.29 కోట్లు చెల్లిస్తున్నట్లు లెక్క. కానీ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శన మరీ పేలవంగా ఉండటంతో, అతని ఇంపాక్ట్ పాయింట్లు మైనస్‌లోకి వెళ్లాయి.

Jasprit Bumrah : ఒక్కో బంతికి అక్షరాలా రూ.6.45 లక్షల ఖర్చు.. బుమ్రా బౌలింగుతో ముంబైకి రూ.1.55 కోట్ల నష్టం
Bumrah

Updated on: Apr 30, 2026 | 10:30 AM

Jasprit Bumrah : ముంబై ఇండియన్స్ అంటేనే జస్ప్రీత్ బుమ్రా. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ ఆశగా చూసేది బుమ్రా వైపే. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సీన్ రివర్స్ అయింది. వాంఖడేలో జరిగిన ఈ పరుగుల యుద్ధంలో బుమ్రా బౌలింగ్ తేలిపోయింది. ఒక విశ్లేషణ ప్రకారం.. ఈ ఒక్క మ్యాచులోనే స్టార్ బౌలర్ బూమ్రా వల్ల ముంబైకి దాదాపు రూ.1.55 కోట్ల నష్టం వాటిల్లిందని, అతను వేసిన ఒక్కో బంతి ముంబైకి రూ.6.45 లక్షల భారంగా మారిందని లెక్కలు తేల్చారు.

క్రికెట్ అనలిస్టులు రూపొందించిన ఒక స్పెషల్ ఇంపాక్ట్ మోడల్ ప్రకారం ఒక ఆటగాడికి చెల్లించే వేలం ధరను, అతను ఆడే మ్యాచ్‌లు, ఆ మ్యాచ్‌లో అతను చూపిన ప్రభావంతో పోల్చి చూస్తారు. బుమ్రా ఏడాదికి రూ.18 కోట్లు తీసుకుంటాడు. అంటే సగటున ఒక మ్యాచ్‌కు అతనికి రూ.1.29 కోట్లు చెల్లిస్తున్నట్లు లెక్క. కానీ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శన మరీ పేలవంగా ఉండటంతో, అతని ఇంపాక్ట్ పాయింట్లు మైనస్‌లోకి వెళ్లాయి. ఫలితంగా ఆ మ్యాచ్ విలువ మైనస్ రూ.26.53 లక్షలుగా తేలింది. వెరసి, ముంబైకి ఆ రాత్రి బుమ్రా వల్ల రూ.1.55 కోట్ల నష్టం వాటిల్లిందని ఈ విశ్లేషణ చెబుతోంది.

సాధారణంగా మ్యాచ్ ఉత్కంఠగా ఉన్నప్పుడు బుమ్రాను రంగంలోకి దింపి స్కోరు బోర్డును అదుపు చేస్తారు. కానీ ఆ రోజు 4 సార్లు బుమ్రాను కెప్టెన్ పిలిచినా, ఒక్కసారి కూడా అతను వికెట్ తీయలేకపోయాడు. పవర్ ప్లేలో రన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు, మధ్యలో పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేయలేకపోయాడు. చివరికి 18వ ఓవర్లో కనీసం మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్తాడనుకుంటే.. క్లాసెన్, సలీల్ అరోరా బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు, ఫోర్లు బాది 8 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేశారు.

ముంబై ఇండియన్స్ జట్టుకు బుమ్రా ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లాంటి వాడు. ఎంత భారీ స్కోరైనా అతను ఆపగలడని అందరి నమ్మకం. కానీ 243 పరుగులు చేసినా, బుమ్రా 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయకపోవడమనేది అరుదైన విషయం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల జోరును ఆపడంలో బుమ్రా విఫలమవ్వడం వల్ల ముంబై మానసికంగా కుంగిపోయింది. హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ బౌలర్లు ప్రణాళికను సరిగ్గా అమలు చేయలేకపోయారని అసహనం వ్యక్తం చేశాడు.

ఈ విశ్లేషణ కేవలం ఆర్థిక పరమైన లెక్క మాత్రమే కాదు, జట్టులో బుమ్రా పాత్ర ఎంత కీలకమో చెప్పే ఒక పద్ధతి. అతను విఫలమైతే ముంబై ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందో ఈ రూ.1.55 కోట్ల నష్టం అనే గణాంకం చూపిస్తోంది. బంతికి రూ.6.45 లక్షల ఖర్చు అంటే అది ముంబై యాజమాన్యానికి చలి పుట్టించే విషయమే. తదుపరి మ్యాచ్‌లలో బుమ్రా తన ఫామ్‌ను అందిపుచ్చుకోకపోతే ముంబై ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us