Boycott SRH: రూ.2.34 కోట్లతో సన్‌రైజర్స్‌లోకి పాక్ స్పిన్నర్.. కట్‌చేస్తే.. కావ్యపాపకు పిచ్చెక్కించిన ఫ్యాన్స్

Boycott SRH controversy: ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్‌రైజర్స్ లీడ్స్ ద్వారా జరిగిన ఈ కొనుగోలు కారణంగా కొంతమంది అభిమానులు ‘బాయ్‌కాట్ SRH’ అంటూ ప్రచారం ప్రారంభించారు.

Boycott SRH: రూ.2.34 కోట్లతో సన్‌రైజర్స్‌లోకి పాక్ స్పిన్నర్.. కట్‌చేస్తే.. కావ్యపాపకు పిచ్చెక్కించిన ఫ్యాన్స్
Sunrisers Leeds Signing Abrar Ahmed

Updated on: Mar 13, 2026 | 7:58 AM

Sunrisers Leeds signing Abrar Ahmed: ఇంగ్లాండ్‌లో జరిగే ది హండ్రెడ్ (The Hundred) లీగ్‌లో భారతీయ యాజమాన్యానికి చెందిన జట్టు సన్ రైజర్స్ లీడ్స్ (SunRisers Leeds) పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed)ను వేలంలో కొనుగోలు చేయడంతో వివాదం చెలరేగింది. ఈ జట్టు ఐపీఎల్ (IPL)లోని సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) (SRH) యాజమాన్యమైన సన్ గ్రూప్‌కు చెందినది. వేలంలో అబ్రార్ అహ్మద్‌ను £190,000 (సుమారు రూ.2.34 కోట్లు)కి కొనుగోలు చేశారు. దీంతో ఎస్ఆర్ హెచ్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇది భారత యాజమాన్యంలోని జట్టు పాకిస్థాన్ ఆటగాడిని ఎన్నో సంవత్సరాల తర్వాత తీసుకోవడం వల్ల పెద్ద చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ SRH’ ట్రెండ్ నడుస్తోంది. ఈ కొనుగోలు తర్వాత భారత అభిమానుల్లో కొంతమంది తీవ్రంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో #BoycottSunrisers, #ShameOnSRH వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అభిమానుల ప్రకారం, 2025లో అబ్రార్ అహ్మద్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు భారత సైన్యాన్ని అవమానించేలా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అటువంటి ఆటగాడిని కొనుగోలు చేయడం దేశ భావాలను పట్టించుకోకపోవడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: మీరు మాత్రం 2028 టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా రావొద్దయ్యా.. మా ఇజ్జత్ పోయేలా ఉందిగా

కవ్యా మారన్‌పై కూడా విమర్శలు..

సన్‌రైజర్స్ బ్రాండ్ ముఖచిత్రంగా ఉన్న కవ్య మారన్ పై కూడా కొంతమంది అభిమానులు విమర్శలు గుప్పించారు. లండన్‌లో జరిగిన వేలంలో ఆమె అబ్రార్ అహ్మద్ కోసం భారీగా బిడ్ చేసి ఇతర జట్లను అధిగమించి అతడిని జట్టులోకి తీసుకువచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ECB నిబంధనలు కూడా కీలకం..


ఈ వివాదానికి మరో కారణం UK యాంటీ-డిస్క్రిమినేషన్ చట్టాలు కూడా. జాతీయత ఆధారంగా ఆటగాళ్లను తప్పించడం చట్ట విరుద్ధమని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ముందుగానే హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో భారత యాజమాన్యంలోని నాలుగు జట్లు.. సన్ రైజర్స్ లీడ్స్ (SunRisers Leeds), ఎంఐ లండన్ (MI London), మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (Manchester Super Giants), సౌత్ రన్ బ్రేవ్ (Southern Brave).. పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోకూడదనే అనధికార నియమాన్ని కొనసాగించలేకపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2027 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్ ఫిక్స్.. ఛాంపియన్ ప్లేయర్‌కు హ్యాండిచ్చిన గంభీర్..?

క్రికెట్ పరంగా అబ్రార్ ఎంపికకు ప్రశంసలు..

వివాదం మధ్యలో కూడా క్రికెట్ నిపుణులు మాత్రం ఈ ఎంపికను సమర్థిస్తున్నారు. అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ వైట్ బాల్ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. గత 38 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 52 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. సన్‌రైజర్స్ లీడ్స్ అధికారులు ఈ ఎంపిక పూర్తిగా జట్టు అవసరాలు, ప్రతిభ ఆధారంగా తీసుకున్నదేనని స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us