IND vs AUS: రెండో టెస్టుకు ముందు రోహిత్ సేనకు షాకింగ్ న్యూస్.. గాయంతో దూరమైన స్టార్ ప్లేయర్?

|

Feb 14, 2023 | 10:56 AM

India vs Australia 2nd Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు టీమిండియా యంగ్ ప్లేయర్ దూరమయ్యాడు.

IND vs AUS: రెండో టెస్టుకు ముందు రోహిత్ సేనకు షాకింగ్ న్యూస్.. గాయంతో దూరమైన స్టార్ ప్లేయర్?
Ind Vs Aus
Follow us on

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు భారత జట్టుకు చేదు వార్త వచ్చింది. భారత జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా తిరిగి రాలేదు. శ్రేయాస్ ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా లేడు. ఈ కారణంగా అతను ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది.

రెండో టెస్టు నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్..

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్టులో కూడా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ కారణంగా రెండో టెస్టుకు కూడా దూరం కానున్నాడు. శ్రేయాస్‌ ఔట్‌ కావడంతో సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో అవకాశం వస్తుందని భావిస్తున్నారు.

బుమ్రా రీఎంట్రీ ఎప్పుడు..

భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయంపై కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. సమాచారం ప్రకారం, జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నుంచి మాత్రమే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చంట. ఇటువంటి పరిస్థితిలో, బుమ్రా టెస్ట్ సిరీస్‌లోకి తిరిగి వస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే దక్కింది.

ఇవి కూడా చదవండి

భారతదేశం వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదలుకానుంది. ఆ తర్వాత సిరీస్‌లోని మూడో టెస్ట్ మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మార్చి 1 నుంచి 5 వరకు జరుగుతుంది. ఈ టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత, ఆస్ట్రేలియాతో మార్చి 17 నుంచి భారత్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..