IND vs AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. మూడో టెస్ట్‌ వేదికలో కీలక మార్పు.. కారణం ఏంటంటే?

|

Feb 13, 2023 | 10:38 AM

India vs Australia 3rd Test: షెడ్యూల్ ప్రకారం ధర్మశాలలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అక్కడి అభిమానులకు భారీ షాక్ తగిలింది.

IND vs AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. మూడో టెస్ట్‌ వేదికలో కీలక మార్పు.. కారణం ఏంటంటే?
Ind Vs Aus
Follow us on

భారత్, ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో మూడో టెస్టు మ్యాచ్ జరగదని బీసీసీఐ సోమవారం స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్‌ని ధర్మశాల నుంచి ఇండోర్‌కు మార్చారు. ఈ మేరకు బీసీసీఐ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ధర్మశాలలో మూడో టెస్టు జరగదని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ కూడా ఈ వార్తను ధృవీకరించింది.

బీసీసీఐ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంను సందర్శించి పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు. బోర్డుకు నివేదిక సమర్పించడకంతో.. మరుసటి రోజే నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీలో, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

అవుట్‌ఫీల్డ్‌తో ఇబ్బందులు..

ధర్మశాలలో చల్లటి వాతావరణం, ఔట్‌ఫీల్డ్‌లోని పరిస్థితులను చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ తెలిపింది. అవుట్‌ఫీల్డ్‌లో తగినంత గడ్డి లేదు. అందుకు ఇంకా సమయం పడుతుంది. ఈ కారణంగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ధర్మశాలలో కాకుండా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ధర్మశాలలో టెస్ట్ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దాని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహాయకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా తన సొంత పిచ్‌కు అనుగుణంగా ఇక్కడ పిచ్‌ను పొందాలని భావిస్తోంది. కానీ, ఇప్పుడు అది జరగదు. ధర్మశాల నుంచి మ్యాచ్‌ను మార్చడం వేలాది మంది అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ఎందుకంటే వారు చాలా కాలంగా అక్కడ వరల్డ్ క్లాస్ టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..