Border Gavaskar Trophy 2024: రేపటి నుంచే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైమింగ్స్, షెడ్యూల్ మీద ఓ లుక్కెయండి !

|

Nov 21, 2024 | 10:46 AM

రేపటి నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహిస్తాడు.

Border Gavaskar Trophy 2024: రేపటి నుంచే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైమింగ్స్, షెడ్యూల్ మీద ఓ లుక్కెయండి !
Border Gavaskar Trophy 2024
Follow us on

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య రేపు (నవంబర్ 22) ప్రారంభం కానుంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ సెషన్ టైమింగ్స్ విడుదలయ్యాయి.  మ్యాచ్ IST ఉదయం 7.50 గంటలకు ప్రారంభమవుతుంది.

  • మొదటి సెషన్ ఉదయం 7.50 నుండి 9.50 వరకు జరుగుతుంది.
  •  9.50 AM నుండి 10.30 AM వరకు భోజన విరామం ఉంటుంది.
  • రెండో సెషన్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది.
  • మధ్యాహ్నం 12.30 నుండి 12.50 వరకు టీ విరామం ఉంటుంది.
  • మూడో సెషన్ మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 2.50 గంటల వరకు జరగనుంది.

ఇది తొలి టెస్టు మ్యాచ్ సెషన్ టైమింగ్స్ మాత్రమే. రెండో టెస్ట్ మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.

ప్లేయింగ్ లెవెన్:

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యస్సవి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్) , రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, పర్దీష్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్

ఆస్ట్రేలియా జట్టు:  పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి