గత వారం ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో కెనడియన్ మహిళ క్రికెటర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిఫార్మా అథ్లెటిక్ క్లబ్‌లో జరిగిన మ్యాచ్‌లో కెనడా ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఇంకా ఒక్క పరుగు కూడా చేయని ఓపెనర్ దివ్య సక్సేనా బ్యాటింగ్ చేస్తున్నారు. అమెరికన్ సీమర్ సారా ఫరూక్ బౌలింగ్ చేసింది. ఫరూక్ యొక్క షార్ట్ డెలివరీని దివ్య సక్సేనా గాల్లోకి లేపింది. క్యాచ్‌ను పట్టుకోవడానికి అమెరికన్ ఫీల్డర్లు ప్రయత్నం చేయగా సక్సేనా కూడా బంతి దిగిన వైపు పరుగెత్తింది. అమెరికన్ వికెట్ కీపర్ సింధు శ్రీహర్ష క్యాచ్ పట్టకుండా అడ్డుకుంది. దీంతో యూఎస్ఏ జట్టు వికెట్ కోసం అప్పీల్ చేసింది. అయితే అంపైర్ నిగెల్ డుగ్యిడ్ సక్సేనా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించడానికి అనుమతించాడు. దీనిపై న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ ట్వీట్ చేశాడు. “ఇది ఆదర్శవంతమైన కఠోరమైన మోసం కంటే తక్కువ అని నాకు తెలుసు, కానీ ఇది ఇప్పటికీ చాలా ఫన్నీగా ఉంది.” అని అన్నాడు.
From last week in Mexico… @usacricket Women loss by 7 runs to Canada. Blatant obstructing the field by opener Divya Saxena off her first ball in the first over of play. Given not out. She went on to make 40 out of Canada’s total of 85. pic.twitter.com/WHRbryODSk
— Peter Della Penna (@PeterDellaPenna) October 31, 2021
ఈ మ్యాచ్‌లో కెనడా ఏడు పరుగులతో గెలిచింది. అయితే సక్సేనా 40 పరుగులతో టాప్-స్కోర్ చేసి మ్యాచ్‌ను గెలిపించింది. టీ20 పోటీల్లో అమెరికాకు ఇది ఏకైక ఓటమి. “ఇది సంచలనం, నేను ఇప్పటివరకు ఇలాంటి చూడ లేదు” అని క్రికెట్ రచయిత నిక్ ఫ్రెండ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇదే తరహా గత మార్చిలో, శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలక వివాదాస్పదంగా వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా ఫీల్డ్‌ను అడ్డుకోవడం ద్వారా అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ అడ్డుకోవడంతో అపఖ్యాతి పాలయ్యాడు. అలాగే ICC మహిళల T20 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫైయర్స్‌లో బ్రెజిల్ జాతీయ మహిళల జట్టు కెనడాపై ఒక పరుగుతో అద్భుత విజయం సాధించింది.
Read Also.. Viral Video: రోడ్డుపైకి వచ్చిన ఆవు ఏం చేసిందంటే.. వైరల్ అయిన వీడియో..