
త్వరలో భారత్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందూ న్యూజిలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అయిన రచన రవింద్ర కుడి భుజానికి గాయం అయింది. తాజాగా ఆక్లాండ్‌లో జరిగిన ఒక ప్రమోషనల్ షూట్‌లో భాగంగా డైవ్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు రచన్ రవీంద్ర.. ఈ ప్రమాదంలో అతని కుడి భుజానికి గాయం అయింది.
అయితే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పెద్దగా ప్రమాదం ఏం లేదని.. కండరాలకు ఎలాంటి పెద్ద గాయం అవ్వలేదని తెలిపారు. కానీ ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొది. అయితే రాబోయే వారాల్లో రిహాబిలిటేషన్ కు రవీంద్ర శరీరం ఎలా స్పందిస్తుంది అనేదానిపైనే అతను భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అడతాడా లేదా అనేది ఆధారపడి ఉంటుందని బోర్డు తెలిపింది. దీంతో ఈ సిరీస్‌లో రచన్ ఉండారా లేదా అనేది దానిపై సస్పెన్స్ నెలకొంది.
భారత్‌తో జరగబోయే ఈ ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ అక్టోబర్ 22న నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ టెస్ట్ రిసీస్ కోసం న్యూజిలాండ్ ఇంకా తమ జట్టును ప్రకటించలేదు.. దాదాపు వచ్చే వారంలో జట్టును ఫైనల్ చేసి ప్రకటించనుంది. ఈ క్రమంలో రచన్ గాయపడడంతో.. జట్టులోకి అతని ఎంట్రీపై సెలక్టర్స్ ఆలోచనలో పడ్డారు. జట్టు ప్రకటనలోపూ రచన్ కోలుకుంటే అతను సిరీస్‌కు వచ్చే అవకాశం ఉంది.
దీనిపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రచన్ ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. కాబట్టి అతని గాయం విషయంలో జట్టు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కువగా ఉన్నందున, రచిన్‌ను తొందరపెట్టి మైదానంలోకి తీసుకురావాలని తాము అనుకోవట్లేదని.. అతని త్వరలోనే పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులోకి వస్తారని అనుకుంటున్నామన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.