ఐపీఎల్ వేలాన్ని రద్దు చేయాలి.. క్రికెటర్ల మైండ్ తో గేమ్స్ వద్దు.. టీమిండియా పేసర్ సంచలన వ్యాఖ్యలు..!

IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం విధానంపై భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కీలక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రతి సీజన్ ముందు జరిగే ఈ వేలంపాట ఆటగాళ్ల మానసిక స్థితిపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తుందని చెప్పారు. ఒకవేళ అవకాశం ఉంటే లీగ్ వ్యవస్థ లోపల ఈ ఆక్షన్ పద్ధతినే పూర్తిగా ఎత్తివేయాలని ఆయన సూటిగా స్పష్టం చేశారు.

ఐపీఎల్ వేలాన్ని రద్దు చేయాలి.. క్రికెటర్ల మైండ్ తో గేమ్స్ వద్దు.. టీమిండియా పేసర్ సంచలన వ్యాఖ్యలు..!
Bhuvneshwar Kumar

Updated on: Sep 16, 2026 | 8:50 PM

IPL Auction: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్లలో ఒకడిగా పేరుగాంచాడు. 2009 సీజన్ మొదలుకొని లీగ్‌తో అనుబంధం కొనసాగిస్తున్న భువీ, 2011లో అరంగేట్రం చేశాడు. గత రెండు సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరపున ఆడుతున్న ఈ స్వింగ్ మాస్టర్, జట్టు వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తాజా సీజన్‌లో 28 వికెట్లు నేలకూల్చి పాత ఫామ్‌ను కొనసాగించాడు. ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ (UP T20 League) నాలుగో సీజన్‌లోనూ అత్యుత్తమ బౌలింగ్‌తో తన జట్టును ఫైనల్ వరకు నడిపించిన భువీ, తాజాగా ఐపీఎల్ వేలం పాటపై చేసిన కీలక వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

జతిన్ సప్రూ (Jatin Sapru) యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై వేలం చూపే ప్రభావాన్ని విడమరిచి చెప్పాడు. లీగ్‌లో కోట్లకు కోట్లు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను తలో 14.20 కోట్లకు సొంతం చేసుకోగా, మెగా వేలంలో రిషబ్ పంత్ (Rishabh Pant) రికార్డు స్థాయిలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వద్ద 27 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ వేలం ప్రక్రియ ఆటగాళ్లకు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని భువీ అభిప్రాయపడ్డాడు. 2013-14 సీజన్ వేలం సమయంలో తాను భారత జాతీయ జట్టులో ఆడుతున్నప్పటికీ, తనను ఎవరు తీసుకుంటారు? భవిష్యత్తు ఏమిటి? అనే భయం తీవ్రంగా వేధించిందని గుర్తుచేసుకున్నాడు. బయటకు చెప్పకపోయినా ప్రతీ ప్లేయర్ తీవ్ర ఆందోళనను అనుభవిస్తారని, ఆప్షన్ ఉంటే ఈ వేలం విధానాన్ని రద్దు చేయడమే సరైన నిర్ణయమని ఆయన పేర్కొన్నాడు.

లీగ్‌లో భువనేశ్వర్ ప్రయాణం 2009లో బెంగళూరు వద్ద రూ. 6 లక్షలతో ప్రారంభమైంది. అనంతరం పూణే వారియర్స్ ఇండియా (Pune Warriors India) జట్టుకు రూ. 20 లక్షల ధరకు ఆడాడు. 2014 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు రూ. 4.25 కోట్లకు దక్కించుకుని పదేళ్లపాటు కొనసాగించింది. ఈ ప్రయాణంలో 2018-2021 కాలానికి రూ. 8.50 కోట్లు, ఆపై 2022-2025 వరకు రూ. 4.20 కోట్లు అందుకున్నారు. 2025 మెగా ఆక్షన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 10.75 కోట్లకు భువీని దక్కించుకుని, 2026 సీజన్‌కు కూడా రిటైన్ చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us