
Best ODI bowling figures for India: ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతోన్న ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డే ఇంటర్నేషనల్‌లో రెండవ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈక్రమంలో సిరాజ్ సంయుక్తంగా అత్యంత వేగవంతమైన ODI ఐదు వికెట్ల ప్రదర్శనను కూడా నమోదు చేశాడు.
50-ఓవర్ల ఫార్మాట్‌లో భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శనగా సిరాజ్ స్పెల్ మరొక ప్రత్యేక ఉదాహరణగా మారింది. బంగ్లాదేశ్‌పై 4 వికెట్ పడగొట్టి, కెరీర్‌లో అత్యుత్తమ ఫిగర్ 6 వికెట్లతో బెస్ట్ బౌలర్‌గా మారాడు.
ఒక ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంకాతో మొదలుపెట్టి చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, షనక, కుశాల్ మెండీస్ వికెట్లను పడగొట్టడంతో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో పాటు ఓవరాల్‌గా 6 వికెట్లు పడగొట్టాడు.
ఈ ప్రక్రియలో అజంతా మెండిస్ వికెట్ తర్వాత సిరాజ్ అత్యంత వేగంగా 50 ODI వికెట్లు (తక్కువ బంతులు) పూర్తి చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.
Watch The Greatest Spell of Mohammed Siraj 💥
Don't Miss The Celebration Of Captain Rohit Sharma In The End 🦁 #Siraj #INDvsSLpic.twitter.com/JFYC3Dgg4c
— Immy² (@BeingImRo45) September 17, 2023
భారతదేశం తరపున 10 మంది వేర్వేరు బౌలర్లు ఆరు వికెట్లు తీశారు. ఆశిష్ నెహ్రా వన్డే ఇంటర్నేషనల్స్‌లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు.
స్టువర్ట్ బిన్నీ – 6/4 vs బంగ్లాదేశ్ 2014లో
అనిల్ కుంబ్లే – 6/12 vs వెస్టిండీస్ 1993లో
జస్ప్రీత్ బుమ్రా – 6/19 vs ఇంగ్లండ్ 2022లో
మహ్మద్ సిరాజ్ – 6/21 vs శ్రీలంక 2023
ఆశిష్ నెహ్రా – 6/23 vs ఇంగ్లండ్ 2003లో
కుల్దీప్ యాదవ్ – 6/25 vs ఇంగ్లండ్ 2018లో
మురళీ కార్తీక్ – 6/27 vs ఆస్ట్రేలియా 2007లో
అజిత్ అగార్కర్ – 6/42 vs ఆస్ట్రేలియా 2004లో
యుజ్వేంద్ర చాహల్ – 6/42 vs ఆస్ట్రేలియా 2019లో
అమిత్ మిశ్రా – 6/48 vs జింబాబ్వే 2013లో
ఎస్ శ్రీశాంత్ – 6/55 vs ఇంగ్లండ్ 2006లో
ఆశిష్ నెహ్రా – 6/59 vs శ్రీలంక 2005లో
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..