INDIA VS ENGLAND: సిక్సర్‌తో డబుల్ సెంచరీ కంప్లీట్ చేయడం హైలెట్.. సారథిని పొగడ్తలతో ముంచెత్తిన..
INDIA VS ENGLAND: సిక్సర్‌తో రూట్ ద్విశతకం చేయడం హైలెట్ అని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. వందో టెస్టులో
INDIA VS ENGLAND: సిక్సర్‌తో రూట్ ద్విశతకం చేయడం హైలెట్ అని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. వందో టెస్టులో ద్విశతకం చేయడం అద్భుతమని ప్రశంసించాడు. తమ జట్టులో సగం మంది బ్యాట్స్‌మెన్స్ అతడిలా స్పిన్‌ను ఎదుర్కోలేరని కొనియాడాడు. చెపాక్‌లో రెండో రోజు ఆట ముగిసిన తర్వాత స్టోక్స్ మీడియాతో పలు విషయాలు వెల్లడించాడు.
జో రూట్ క్రీజులోంచి ముందుకు కదిలి సిక్సర్ కొట్టి ద్విశతకం చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అత్యంత తేలిగ్గా ఆడేస్తున్నాడు. అతడు స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడం ఎంతో బాగుంది. బౌలర్లు వేసే ప్రతి బంతికి అతడి వద్ద సమాధానం ఉంది’ అని స్టోక్స్ అన్నాడు. విరామం తర్వాత తాను జట్టుతో కలవడం, పరుగులు చేయడం సంతోషాన్నిచ్చిందని స్టోక్స్ తెలిపాడు. ప్రస్తుతం తాము పటిష్ఠ స్థితిలో (555/8) ఉన్నామని పేర్కొన్నాడు. ఆదివారం మరో రెండు గంటలు బ్యాటింగ్ చేస్తే జట్టు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని వెల్లడించాడు. మ్యాచు గెలిచి వందో టెస్టు ఆడుతున్న రూట్‌కు దీనిని సమర్పించాలని భావిస్తున్నామన్నాడు.
INDIA VS ENGLAND: అతడి దాడికి లైన్ అండ్ లెన్త్ మార్చుకోక తప్పలేదు.. అయినా చివరికి ఔట్ చేశా..