
ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ తిరిగి ఆరంభం కాబోతుందని క్రికెట్ అభిమానులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఆగిన ఐపీఎల్ రేపటి(మే 17, శనివారం) రీస్టార్ట్ కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌తో మళ్లీ ఐపీఎల్ హంగామా షురూ అవుతుంది. అయితే క్రికెట్ ఆశలపై నీళ్లు చల్లుతూ బెంగళూరులో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా రద్దు అవుతుందా అనే భయం అభిమానుల్లో కలుగుతోంది.
అయితే.. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే విషయం పక్కనపెడితే బెంగళూరులో కురుస్తున్న వర్షానికి ఓ ఆర్సీబీ ప్లేయర్ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అతనెవరో కాదు ఆర్సీబీ బీస్ట్ టిమ్ డేవిడ్. అద్భుతమైన షినిషింగ్ చేస్తూ సూపర్ హాట్ ఫామ్‌లో ఉన్న డేవిడ్ బెంగళూరులో కురుస్తున్న వర్షానికి చిన్నస్వామి స్టేడియంలో గ్రౌండ్‌ను కవర్స్‌తో కవర్ చేశారు. వాటిని నీళ్లు నిలిచి ఉన్నాయి. ఆ నీళ్లపై టిమ్ డేవిడ్ సరదాగా డై చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఆ వీడియోలో టిమ్ డేవిడ్‌ను చూస్తుంటే.. ఒక బీస్ట్‌ను చూసినట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారీ కటౌట్‌తో షర్ట్ లేకుండా డేవిడ్ అలా నడిచివస్తుంటే వామ్మో మామూలుగా లేదు. హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని కటౌట్ నీది బ్రో అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ డేవిడ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే.. బెంగళూరులో కురుస్తున్న వర్షానికి ఆర్సీబీ ఫ్యాన్స్ వరీ అవుతున్నా.. వాళ్లు ఒక విషయం తెలుసుకోవాలి. దేశంలోనే మంచి డ్రైనేజీ వ్యవస్థ కలిగిన క్రికెట్ స్టేడియం చిన్నస్వామి స్టేడియం. సో డోంట్ వరీ. మ్యాచ్‌కి అరగంట ముందు వర్షం ఆగినా.. గ్రౌండ్ రెడీ అయిపోతుంది. అంత అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ ఉంది. సో.. కంగారు అవసరం లేదు.. టిమ్ డేవిడ్‌లా మీరు కూడా వర్షాన్ని ఎంజాయ్ చేయండి చాలు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..