IND vs ENG: ఆ సెంచరీలు ఏం చేసుకోవడానికి..! జడేజా, సుందర్‌ల పోరాటంపై బెన్‌ స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ అద్భుతమైన డ్రా సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా, సుందర్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమి నుంచి తప్పించుకుంది. ఇద్దరూ సెంచరీలకు దగ్గరగా వచ్చారు. ఇంగ్లాండ్‌ డ్రాకు ఆఫర్ చేసినా, జడేజా తన ఐదో, సుందర్‌ తన మొదటి సెంచరీలను పూర్తి చేశారు.

IND vs ENG: ఆ సెంచరీలు ఏం చేసుకోవడానికి..! జడేజా, సుందర్‌ల పోరాటంపై బెన్‌ స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Ben Stokes And Jadeja

Updated on: Jul 28, 2025 | 4:07 PM

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతంగా పోరాడి.. మ్యాచ్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో.. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఇండియాకు ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. పైగా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి ఖాయమనుకున్నారు. కానీ అక్కడి నుంచి అసలు ఆట మొదలైంది.

కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి.. ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇస్తూ భారత్‌ ఓటమి నుంచి రక్షించారు. అయితే మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాట్లాడుతూ.. జడేజా, వాష్టింగన్‌ సుందర్‌ సెంచరీలు పూర్తి చేసుకోకపోయినా.. వారి పోరాటం తక్కువ కాదని అన్నాడు. వాళ్లిద్దరూ చాలా అద్భుతంగా ఆడారంటూ కితాబిచ్చాడు. కేవలం మరో 10 పరుగులు వారి పోరాటానికి కోలమానం కాదన్నట్లు పేర్కొన్నాడు. కాగా జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ సెంచరీకి దగ్గరైన క్రమంలో ఇక మ్యాచ​్‌ను ముగించి డ్రాగా తీసుకుందామని ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు భావించారు. కానీ, జడేజా మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

తన సెంచరీ తర్వాత సుందర్‌ సెంచరీ సైతం పూర్తి అయ్యేంత వరకు ఆటను కొనసాగించాడు. ఈ విషయంపై స్పందిస్తూనే బెన్‌ స్టోక్స్‌ పై విధంగా పేర్కొన్నాడు. నిజానికి ఆట చివరి గంట ప్రారంభమైనప్పుడు, స్టోక్స్ భారత్‌కు డ్రా ఆఫర్ ఇచ్చాడు. కానీ జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ 80 పరుగులు చేయడంతో భారత జట్టు డ్రాకు ఒప్పుకోలేదు. మరో ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో జడేజా తన ఐదో సెంచరీ, వాషింగ్టన్‌ సుందర్‌ తన మొదటి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి