IND vs SA: దక్షిణాఫ్రికాకు టూర్‌కు టీమిండియా.. టీ20, వన్డేల నుంచి రోహిత్‌, కోహ్లీ ఔట్‌.. కారణమిదే

|

Dec 01, 2023 | 6:50 AM

ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇప్పుడు విదేశీ పర్యటనకు సిద్ధమైంది టీమిండియా. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత జట్టు డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరనుంది. తాజాగా సఫారీ టూర్‌ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ.

IND vs SA: దక్షిణాఫ్రికాకు టూర్‌కు టీమిండియా.. టీ20, వన్డేల నుంచి రోహిత్‌, కోహ్లీ ఔట్‌.. కారణమిదే
Team India
Follow us on

ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇప్పుడు విదేశీ పర్యటనకు సిద్ధమైంది టీమిండియా. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత జట్టు డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరనుంది. తాజాగా సఫారీ టూర్‌ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి వన్డేల నుంచి విశ్రాంతి ఇచ్చారు. టెస్టు సిరీస్‌లో మాత్రమే రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. వన్డేలు, టీ20లకు తమను పరిగణనలోకి తీసుకోవద్దని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని రోహిత్, కోహ్లి అభ్యర్థించినట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికా పర్యటనకు గురువారం (నవంబర్‌ 30) భారత జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించింది. టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రోహిత్, విరాట్ కోహ్లిలు టీ20, వన్డే సిరీస్‌ల నుంచి విశ్రాంతి కోరినట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే టెస్టు సిరీస్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చేరనున్నారు.

కాగా టెస్టు జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను నియమించింది బీసీసీఐ. కేఎల్‌ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా టెస్టు జట్టులోకి తిరిగి వచ్చారు. బౌలింగ్‌ విభాగంలో ప్రసిద్ధ్‌ కృష్ణను పరిగణనలోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మొత్తం 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా వన్డే జట్టు

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్ అండ్‌ వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, ముఖేష్ ఖాన్, అవేష్ కుమార్, అవేష్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్ చాహర్.

టీ20 జట్టు

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిష్టన్ సుందర్, వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

టీమ్ ఇండియా టెస్ట్ స్క్వాడ్

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ (ఫిట్‌నెస్ ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గితేనే), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్‌ కృష్ణ

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..