
ఐసీసీ ప్రపంచ కప్ 2023 (ICC world cup 2023) ప్రారంభ వేడుకలు రద్దు కావడంతో నిరాశకు గురైన సంగతి తెలిసిందే. అయితే, అభిమానులకు ఇప్పుడు సంతోషకరమైన వార్త అందింది. అక్టోబరు 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi stadium) లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య హైవోల్టేజీ పోరు ప్రారంభం కావడానికి ముందు సెలబ్రేషన్స్(Musical Ceremony)ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో అభిమానుల కోసం బీసీసీఐ ఈ సెలబ్రేషన్స్‌ను నిర్వహించనుంది. ఈ సమయంలో, లైట్ షోలతోపాటు డ్యాన్స్ ప్రదర్శనలు ఉంటాయి. గాయకుడు అరిజిత్ సింగ్ (Arijit Singh) ప్రదర్శన ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ప్రపంచకప్ ప్రారంభానికి ముందే సచిన్ టెండూల్కర్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌లకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లు అందించింది. అందుకే ఈ ముగ్గురిని ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానించారు. నివేదికల ప్రకారం అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు సంగీత్ వేడుకను నిర్వహించనున్నారు. గోల్డెన్ టికెట్ హోల్డర్లు మ్యాచ్ చూసేందుకు స్టేడియం వద్దకు వస్తారని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అనిల్ పటేల్ తెలిపినట్లు సమాచారం.
వీరే కాకుండా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు పలువురు వీఐపీలు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజున బాలీవుడ్ స్టార్స్ ఈవెంట్ మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:10 గంటలకు ముగుస్తుంది. అలాగే భారత్-పాక్ మ్యాచ్ కు 20 నుంచి 25 మంది పాక్ మీడియా ప్రతినిధులు రానున్నారు. అనుమతి ఇచ్చామని, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మ్యాచ్‌కు పీసీబీకి చెందిన కొందరు అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంది.
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోటీ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో భారత్ ఆధిపత్యం చెలాయించగా, ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్ సంపూర్ణ విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..