Team India: టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా కొత్త కెప్టెన్‌ ఫిక్స్.. ప్రకటించేది ఎప్పుడంటే?

India vs England Test Series: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది. కానీ, ఈ పర్యటనకు ముందే, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది.

Team India: టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా కొత్త కెప్టెన్‌ ఫిక్స్.. ప్రకటించేది ఎప్పుడంటే?
Team India

Updated on: May 11, 2025 | 7:06 AM

India vs England Test Series: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టెస్ట్ ఫార్మాట్‌లో కొత్త కెప్టెన్‌ను ప్రకటించనుంది. ఎందుకంటే, ఈ సిరీస్‌కు ముందే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతలో, కొత్త కెప్టెన్ పేరును బోర్డు ఇప్పటికే ఖరారు చేసిందని తెలుస్తోంది. దీనిని ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించవచ్చు అని అంటున్నారు.

కొత్త కెప్టెన్‌ను ప్రకటించేది ఎప్పుడంటే?

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది. కానీ, ఈ పర్యటనకు ముందే, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది.

కాగా, బీసీసీఐ కొత్త కెప్టెన్ పేరును ఖరారు చేసింది. దీనిని ప్రవేశపెట్టడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. నివేదికల ప్రకారం కొత్త కెప్టెన్ పేరును వెల్లడించడానికి బోర్డు మీడియా సమావేశం నిర్వహించవచ్చు అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మే 23న జట్టును ప్రకటించే అవకాశం..

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సిరీస్ పై క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్‌లో రెండు జట్ల మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. కానీ, అంతకు ముందే బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించవచ్చు. క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం జట్టు ఎంపిక మే 23న జరిగే అవకాశం ఉంది. ఇదే రోజు టెస్ట్ కెప్టెన్‌ను ప్రకటించే ఛాన్స్ ఉంది.

5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ చూడండి..

1వ టెస్ట్: జూన్ 20-24, 2025 – హెడ్లింగ్లీ, లీడ్స్

2వ టెస్ట్: జులై 2-6, 2025 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

3వ టెస్ట్: జులై 10-14, 2025 – లార్డ్స్, లండన్

4వ టెస్ట్: జులై 23-27, 2025 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

ఐదవ టెస్ట్: జులై 31-ఆగస్టు 4, 2025 – ది ఓవల్, లండన్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..