BCCI: గిన్సీస్‌ రికార్డు కెక్కిన ఐపీఎల్‌ 2022 ఫైనల్ మ్యాచ్‌.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా..

|

Nov 27, 2022 | 9:01 PM

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌ గిన్నీస్‌ రికార్డు కెక్కినట్లు బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆదివారం (నవంబర్‌ 27) వెల్లడించారు. గత మే 29వ తేదీన అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని..

BCCI: గిన్సీస్‌ రికార్డు కెక్కిన ఐపీఎల్‌ 2022 ఫైనల్ మ్యాచ్‌.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా..
BCCI enters into Guinness Book of World Records
Follow us on

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌ గిన్నీస్‌ రికార్డు కెక్కినట్లు బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆదివారం (నవంబర్‌ 27) వెల్లడించారు. గత మే 29వ తేదీన అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ చూసేందుకు దాదాపు 1,01,566 మంది వచ్చారు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇంత మంది అభిమానులు ఒక మ్యాచ్‌కు హాజరుకావడం ఇదే తొలిసారి. దీంతో అత్యంత అధిక ప్రేక్షకులు హాజరైన తొలి ఐపీఎల్‌గా గిన్నీస్‌ రికార్డు సొంతం చేసుకుందని షా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇది భారత్‌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం గర్వించదగ్గ విషయమని, బిగ్‌ థ్యాంక్స్‌ టు ఆడియన్స్ అని సంతోషం వ్యక్తం చేశారు.

ఇంత మంది ఆడియన్స్‌ హాజరైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15వ అడిషన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌- రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3 వికెట్లు పడగొట్టి, 30 బంతుల్లో 34 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా హార్ధిక్ పాండ్యా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

కాగా గతంలో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ పేర ఉన్న ఈ రికార్డు తాజాగా మన దేశం సాధించింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సామర్థ్యం 1,00,024ల మంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియం సామర్థం దాదాపు 1,10,000ల మంది. అంటే దాదాపు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కంటే దాదాపు 10,000 ఎక్కువ.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.