వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించిన బీసీసీఐ..! ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కెప్టెన్ యంగ్ ప్లేయర్..
బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన రోహిత్, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. గిల్ ఇప్పుడు టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

టీమిండియా సీనియర్ ప్లేయర్, కెప్టెన్‌గా 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని స్థానంలో యంగ్ ప్లేయర్, భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కాగా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీ20 ఫార్మాట్‌కు, ఆ తర్వాత టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
రోహిత్ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు ఈ ఫార్మాట్ ఆడాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మరి అప్పటి వరకు రోహితే కెప్టెన్‌గా ఉంటాడని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా రోహిత్‌ను తప్పించి, అతని ప్లేస్‌లో శుబ్‌మన్ గిల్‌ను బీసీసీఐ కెప్టెన్‌గా నియమించింది. దీంతో టెస్టు, వన్డే రెండు ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్‌గా అయ్యాడు గిల్. టీ20 జట్టుకు మాత్రం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా గిల్ కెప్టెన్‌గా టీమిండియా ఆస్ట్రేలియాతో వారి దేశంలో ఈ నెల 19 నుంచి మూడు వన్డేలు ఆడనుంది. అలాగే 5 టీ20ల సిరీస్ కూడా ఆడుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




