BCCI Central Contract : బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి

BCCI Central Contract : బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక నిర్దిష్ట సీజన్‌లో కనీసం నిర్ణీత సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితేనే సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత లభిస్తుంది. మహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్‌లు గత కాంట్రాక్ట్ సైకిల్‌లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.

BCCI Central Contract : బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి
Bcci Central Contract

Updated on: Feb 11, 2026 | 11:07 AM

BCCI Central Contract : భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి ప్రకటించిన జాబితాలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రేడ్ తగ్గడం ఒక ఎత్తైతే.. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లకు అసలు కాంట్రాక్టే దక్కకపోవడం మరో ఎత్తు. గతంలో 34 మందికి చోటు కల్పించిన బీసీసీఐ, ఈసారి ఆ సంఖ్యను 30కి తగ్గించింది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక నిర్దిష్ట సీజన్‌లో కనీసం నిర్ణీత సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితేనే సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత లభిస్తుంది. మహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్‌లు గత కాంట్రాక్ట్ సైకిల్‌లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. షమీ గాయం కారణంగా సుదీర్ఘ కాలం దూరంగా ఉండగా, సర్ఫరాజ్ ఖాన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నా తుది జట్టులో అవకాశం దక్కలేదు. దీంతో వీరికి కాంట్రాక్ట్ రెన్యూవల్ కాలేదు. ఇది షమీ కెరీర్‌పై సెలక్టర్ల ఆలోచనను స్పష్టం చేస్తోంది.

కోహ్లీ, రోహిత్ గ్రేడ్ తగ్గడానికి కారణం?

ఈసారి గ్రేడ్-A లో కేవలం శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే చోటు దక్కించుకున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రేడ్-B కి పరిమితమయ్యారు. వీరు కేవలం ఒకటి లేదా రెండు ఫార్మాట్లకే పరిమితం కావడం లేదా భవిష్యత్తు ప్రణాళికల్లో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా, నిలకడగా రాణిస్తున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గ్రేడ్-C కి పడిపోయారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా 2025-26

గ్రేడ్ A (రూ. 5 కోట్లు): శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.

గ్రేడ్ B (రూ. 3 కోట్లు): వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్.

గ్రేడ్ C (రూ. 1 కోటి): అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..