Wriddhiman Saha: సాహా ఇష్యూలో భారీ షాకిచ్చిన బీసీసీఐ.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం..

|

May 04, 2022 | 4:51 PM

వృద్ధిమాన్ సాహా ఫిబ్రవరి 19న ఒక ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందులో బోరియా మజుందార్ వాట్సాప్ సందేశానికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్‌లు కూడా ఉన్నాయి.

Wriddhiman Saha: సాహా ఇష్యూలో భారీ షాకిచ్చిన బీసీసీఐ.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం..
Wriddhiman Saha
Follow us on

భారత జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha)ను బెదిరించిన స్పోర్ట్స్ జర్నలిస్టు బోరియా మజుందార్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బోరియా మజుందార్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. బీసీసీఐ(BCCI) ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ మజుందార్‌ను దోషిగా నిర్ధారించింది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సాహాను మజుందార్ బెదిరించినట్లు తెలిసిందే. ఈ విషయాన్ని సాహా ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆ ట్వీట్‌లో జర్నలిస్టు పేరును సాహా ప్రస్తావించనప్పటికీ, బీసీసీఐ ఈ విషయాన్ని గ్రహించి భారత క్రికెటర్‌తో మాట్లాడింది. ఆ తర్వాత బోరియా మజుందార్(Boria Majumdar) పేరు బయటకు వచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి బీసీసీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దోషిగా తేలిన తరువాత, ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై నిషేధం విధించింది.

వృద్ధిమాన్ సాహా ఫిబ్రవరి 19న ఒక ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందులో బోరియా మజుందార్ వాట్సాప్ సందేశానికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్‌లు కూడా ఉన్నాయి. ‘భారత క్రికెట్‌కు ఇంత చేసిన తర్వాత, ఒక గౌరవనీయమైన జర్నలిస్టు నుంచి నేను వినాల్సింది ఇదేనా. మన దేశ జర్నలిజం ఎక్కడికి వెళుతుందో చెప్పడానికి ఇదొక్కటి చాలు’ అంటూ సాహా ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

బోరియా మజుందార్‌పై కీలక చర్య..

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ఆదేశం ప్రకారం, బోరియా మజుందార్ 2 సంవత్సరాల పాటు ఏ భారతీయ క్రికెటర్‌ను ఇంటర్వ్యూ చేయలేరు. బోరియా మజుందార్ భారత్‌లో లేదా దేశంలో ఏ మ్యాచ్‌కైనా అక్రిడిటేషన్ పొందలేరు. అలాగే, బోరియా మజుందార్ ఏ బీసీసీఐ సభ్యుడు లేదా రాష్ట్ర సంఘాల అధికారులతో రెండేళ్లపాటు సంభాషించలేడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: విరాట్ సరసన సీఎస్కే సారథి.. కేవలం 6 అడుగుల దూరమే.. ఆ స్పెషల్ రికార్డులో ఎవరున్నారంటే?

IPL 2022: గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడిన రూ. 11 కోట్ల పంజాబ్ ప్లేయర్.. భారీ సిక్సర్లతో ఊచకోత.. స్పెషల్ రికార్డు కూడా..