Impact Player Rule: ఇకపై ప్లేయింగ్ 11 కాదు.. 15 మంది ప్లేయర్లకు ఛాన్స్.. బీసీసీఐ కొత్త రూల్స్.. ఎప్పటినుంచంటే?

|

Sep 17, 2022 | 2:49 PM

T20 జట్లు ఇకనుంచి నలుగురు అదనపు ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ సమయంలో ప్లేయింగ్ XIని మార్చుకునే ఛాన్స్ ఉంది. ప్లేయింగ్ XIలో మార్పు తర్వాత తీసుకున్న ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు.

Impact Player Rule: ఇకపై ప్లేయింగ్ 11 కాదు.. 15 మంది ప్లేయర్లకు ఛాన్స్.. బీసీసీఐ కొత్త రూల్స్.. ఎప్పటినుంచంటే?
Bcci
Follow us on

Impact Player Rule: T20 జట్లు ఇకనుంచి నలుగురు అదనపు ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ సమయంలో ప్లేయింగ్ XIని మార్చుకునే ఛాన్స్ ఉంది. ప్లేయింగ్ XIలో మార్పు తర్వాత తీసుకున్న ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు. మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే దీనిని ఉపయోగించుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రస్తుతం బీసీసీఐ ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. మీడియా కథనాల ప్రకారం, బీసీసీఐ ఈ మేరకు అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు సర్క్యులర్ జారీ చేసింది.

ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఎలా అమలు చేస్తారో ఇప్పుడు చూద్దాం..

  1. టాస్‌కు ముందు, జట్లు 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్‌లను పేర్కొనాలి. జట్లు ఫీల్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్‌కు తెలియజేయాలి. మ్యాచ్ సమయంలో గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించే వీలు ఉండదు. రెండు ఇన్నింగ్స్‌లలో 14వ ఓవర్‌కు ముందు ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఉపయోగించవచ్చు.
  2. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా ఎవరిని ఉపయోగిస్తారో వారే మ్యాచ్‌ ఆడతారు. ప్లే-11 నుంచి మినహాయించిన ఆటగాడు ఆడలేరు. మ్యాచ్‌లో విరామ సమయంలో లేదా ఫీల్డింగ్ సమయంలో ఆటగాడిని ఉపయోగించలేరు.
  3. దీని నుంచి జట్టుకు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఒక బౌలర్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా చేర్చినట్లయితే, అతను తన పూర్తి 4 ఓవర్లు బౌల్ చేస్తాడు. ఔట్ అయిన బౌలర్ వేసిన ఓవర్ల సంఖ్య లేదా బౌల్ చేయకపోవడం ఆ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ని ప్రభావితం చేయదు.
  4. బ్యాటింగ్ చేసే జట్టు వికెట్ పతనం సమయంలో లేదా ఇన్నింగ్స్ విరామ సమయంలో మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
  5. అయితే, జట్టు కెప్టెన్ లేదా మేనేజ్‌మెంట్ ఒక విషయం గుర్తించుకోవాలి. వారు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమాన్ని ఉపయోగించే ముందు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్‌కు తెలియజేయాలి.
  6. ఈ బీసీసీఐ నిబంధన ప్రకారం మ్యాచ్ సమయంలో ఇరు జట్లూ ఇన్నింగ్స్ 14వ ఓవర్ కంటే ముందు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ని ఉపయోగించుకోవచ్చు. అంటే, దీని తర్వాత నియమం ఉపయోగించలేరు.
  7. ఒక ఆటగాడు గాయపడినట్లయితే, అతని స్థానంలో జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఉపయోగించినట్లయితే, గాయపడిన ఆటగాడు ఇకపై మిగిలిన మ్యాచ్‌లో భాగం కాలేడు.
  8. ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఆ ఓవర్ చివరిలో మాత్రమే ఉపయోగించాలి. అదే సమయంలో ఈ నియమాన్ని ఉపయోగించడం తప్పనిసరి కాదు. దానిని ఉపయోగించాలా వద్దా అనేది జట్లపై ఆధారపడి ఉంటుంది.

గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిచిన తమిళనాడు..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నియమం ఎలా ఉందంటే..

టీ20లో, జట్లు ప్లేయింగ్ ఎలెవన్ ఆటగాళ్లతో పాటు 12వ ఆటగాడి పేరును ఇవ్వాలి. ఫీల్డింగ్ సమయంలో 12వ ఆటగాడిని జట్లు ఉపయోగించుకుంటాయి. కానీ, 12వ ఆటగాడు బ్యాటింగ్ చేయలేడు. బౌలింగ్ చేయలేడు లేదా వికెట్ కీపింగ్ కూడా చేయలేడు.

ఈ నియమం బిగ్ బాష్ లీగ్‌లోనూ..

X ఫ్యాక్టర్ పేరుతో ఆస్ట్రేలియా T20 లీగ్ బిగ్ బాష్‌లో ఈ నియమం వర్తిస్తుంది. ఇందులో, ప్రతి జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్‌కు ముందు ప్లేయింగ్-11లో 12వ లేదా 13వ ఆటగాడిని చేర్చుకోవచ్చు. ఈ సమయంలో అతని స్థానంలో బ్యాటింగ్ చేయని లేదా ఒకటి కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయని ఆటగాళ్లను భర్తీ చేసుకుంటుంది.

ICC సూపర్ సబ్ రూల్ విఫలం..

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2005లో సూపర్ సబ్ రూల్‌ని అమలు చేసింది. దీని ప్రకారం 12వ ఆటగాడిని ఉంచడానికి జట్లకు అనుమతి ఉంది. మ్యాచ్ సమయంలో ప్లేయింగ్ XIలో ఒక ఆటగాడి స్థానంలో జట్లు అతన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈ నియమం ప్రకారం సూపర్ సబ్ ఒక పని చేయడానికి మాత్రమే అనుమతించేవారు. అంటే బ్యాట్స్‌మెన్ కోసం సూపర్ సబ్‌ని తీసుకొచ్చారు. కాబట్టి అతను బ్యాటింగ్ చేయగలడు. బౌలింగ్ చేయలేడు. బౌలర్‌గా చేర్చినట్లయితే, అతను కేవలం బౌలింగ్ మాత్రమే చేయగలడు. అతడిని ఫీల్డింగ్‌కు అనుమతించలేరు. ఈ నిబంధనను 9 నెలల తర్వాత ICC రద్దు చేసింది.