Video: విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు.. కట్‌చేస్తే.. 5 బంతుల్లోనే 233 స్ట్రైక్‌రేట్‌తో వైల్డ్ ఫైర్..

|

Dec 18, 2024 | 10:44 AM

Daniel Sams: బిగ్ బాష్ లీగ్ 2024-25 మూడో మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై సిడ్నీ థండర్స్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌ విజయంలో డేనియల్‌ సామ్స్‌ వీరుడు. ఒకే ఓవర్లో 30 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనతను కూడా సాధించాడు.

Video: విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు.. కట్‌చేస్తే.. 5 బంతుల్లోనే 233 స్ట్రైక్‌రేట్‌తో వైల్డ్ ఫైర్..
Daniel Sams Hit 31 Runs In
Follow us on

Sydney Thunder beat Adelaide Strikers: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 2024-25లో అద్భుతమైన మ్యాచ్ కనిపించింది. ఈ సీజన్‌లో మూడో మ్యాచ్ కాన్‌బెర్రాలో సిడ్నీ థండర్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్ విజయానికి హీరోగా డేనియల్ సామ్స్ నిలిచాడు. అతని తుపాన్ ఇన్నింగ్స్ మొత్తం మ్యాచ్‌ను మార్చేసింది. అతను 233 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేయడంతో తన జట్టును విజయపథంలో నడిపించాడు.

ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించిన డేనియల్ సామ్స్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఇన్నింగ్స్‌లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ థండర్స్ 149 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో జట్టుకు 12 బంతుల్లో 34 పరుగులు అవసరం. విజయం చాలా కష్టంగా మారింది. కానీ, డేనియల్ సామ్స్ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. కేవలం 6 బంతుల్లోనే మ్యాచ్‌ను తన జట్టుకు అనుకూలంగా మలుచుకుని బలమైన విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి, సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ని లాయిడ్ పోప్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ వరకు అతను మ్యాచ్‌లో చాలా పొదుపుగా ఉన్నాడు. 1 వికెట్ కూడా తీసుకున్నాడు. కానీ, ఈ ఓవర్లో డేనియల్ సామ్స్ ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్ తొలి రెండు బంతుల్లో డేనియల్ సామ్స్ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత లాయిడ్ పోప్ బౌలింగ్ లో వైడ్ బాల్ వేశాడు. తర్వాతి 4 బంతుల్లో డేనియల్ సామ్స్ 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. దీని కారణంగా సిడ్నీ థండర్స్ ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులు చేసింది. ఇటువంటి పరిస్థితిలో, సిడ్నీకి చివరి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే అవసరం. 2 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం గమనార్హం.

సిడ్నీ థండర్స్ విజయంతో ప్రారంభం..

ఈ సీజన్‌లో సిడ్నీ థండర్స్‌కి ఇది మొదటి మ్యాచ్. అంటే, సిడ్నీ విజయంతో సీజన్‌ను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో, డేనియల్ సామ్స్ 18 బంతుల్లో 42 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతనితో పాటు, ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ కూడా 27 బంతుల్లో 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు శుభారంభాన్ని అందించాడు. అయితే, కెప్టెన్ డేవిడ్ వార్నర్ 7 పరుగుల ఇన్నింగ్స్ మాత్రమే ఆడగలిగాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..