క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని ఆశ్చర్యకరమైన, ఫన్నీ ఘటనలు జరుగుతుంటాయి. క్రికెటర్లకు ఈ విషయం తెలియనప్పటికీ చూసేవారికి మాత్రం తెగ నవ్వు తెప్పి్స్తుంటాయి. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మ్యాచ్‌లో బ్యాటర్ పరుగు తీసిన విధానం నెట్టింట్లో నవ్వులు పూయించింది. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఆటగాడు ఆఫ్‌సైడ్ అవతల వెళుతున్న బంతిని మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ తీసే ఛాన్సు ఉండడంతో వెంటనే నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న సహచరున్ని రన్ కోసం పిలిచాడు. అయితే సింగిల్‌ను తొందరగా పూర్తి చేసే క్రమంలో పిచ్ మధ్యలోనే బ్యాలెన్స్ కోల్పోయి జారిపడ్డాడు. ఇక రనౌట్ తప్పదనుకున్నారు అందరూ. అయితే ఇదే సమయంలో ఫీల్డర్ త్రో చేసిన బంతిని బౌలర్ సకాలంలో అందుకోవడంలో విఫలమయ్యాడు. సాధారణంగా పిచ్ మధ్యలో పడిపోయిన ఏ బ్యాటర్ అయినా లేచి పరిగెత్తడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం అలా జరగలేదు. పిచ్‌పై దొర్లుకుంటూ కిందా మీదా పడుతూ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌ను చేరుకున్నాడు. మొత్తానికి ఎలాగోలా రనౌట్‌ను తప్పించుకుని ఎలాగోలా సింగిల్‌ను పూర్తి చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా హెచ్‌సీఎల్ వీఐపీ ఎక్స్‌పీరియెన్స్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో గ్రీన్ టీమ్, బ్లూ టీమ్‌లు తలపడ్డాయి. ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా కనీసం లేచి పరిగెత్తే సమయం లేకపోవడంతోనే పొర్లుకుంటూ పరుగు పూర్తి చేసినట్లు సదర్ బ్యాటర్ మ్యాచ్ తర్వాత పేర్కొన్నాడు. కాగా ఈ ఘటన తర్వాత సహచరుడితో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా సదరు బ్యాటర్‌ను అభినందించడం విశేషం. కాగా రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గేమ్ బ్లూ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో గ్రీన్ విజయం సాధించింది. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింగ తెగవైరలవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి. హాయిగా నవ్వుకోండి.
It’s almost like a dream when you’re trying to run but you just can’t? @HCLSoftware#HCLSoftwareVIPExperience pic.twitter.com/RdWgAlwFjX
— European Cricket (@EuropeanCricket) October 18, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..