
క్రికెట్ చరిత్రలో అత్యంత పొదుపైన బౌలింగ్ స్పెల్ ప్లేయర్ బాపు నడ్కర్నిదే. 1964లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 0.15 ఎకానమీ సాధించాడు. ఇందులో 27 మెయిడిన్ ఓవర్లు, వరుసగా 21 మెయిడిన్లు ఉన్నాయి. వికెట్ దక్కకపోయినా.. ఈ రికార్డు ఇప్పటికీ ఓ అద్భుతమని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే.! క్రికెట్‌లో ఓవర్‌కు ఒక పరుగు మాత్రమే ఇవ్వడం అత్యంత పొదుపైన బౌలింగ్ అని చెబుతుంటాం. కానీ, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక బౌలర్ ఓవర్‌కు కేవలం 0.15 పరుగులు మాత్రమే ఇవ్వడం ఓ అద్భుతం. 1964వ సంవత్సరంలో మద్రాస్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను మన టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బాపు నడ్కర్ని సాధించాడు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
ఆ మ్యాచ్‌లో బాపు నడ్కర్ని 32 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి అసాధారణమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇది ఓవర్‌కు 0.15 పరుగులు మాత్రమే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత పొదుపైన బౌలింగ్ స్పెల్ ఇదేనని రికార్డులు చెబుతున్నాయి. ఈ ఐకానిక్ స్పెల్‌లో నడ్కర్ని వరుసగా 131 డాట్ బాల్స్ వేశాడు. అంతేకాదు, వరుసగా 21 మెయిడిన్ ఓవర్లు వేసి ఏ బౌలర్‌కు సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు. తన మొత్తం 32 ఓవర్ల స్పెల్‌లో, నడ్కర్ని ఓవరాల్‌గా 27 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనలో అతనికి ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం గమనార్హం.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..