గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్‌ను అదే ఫార్మాట్‌లో వైట్ వాష్ చేసి.. బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచిన బంగ్లా జట్టు.. క్రికెట్ ప్రపంచాన్ని ఒక్క సారిగా ఆశ్చర్యపరిచింది. ఢాకా వేదికగా మంగళవారం(మార్చి 14) జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్‌పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలవడంతో ఇది సాధ్యమైంది. అవును, ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇచ్చిన 159పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 6 వికెటలకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ మలన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. కెప్టెన్ జోస్ బట్లర్ 40 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు అంతా విఫలమవడంతో బంగ్లా చేతిలో టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌కు ఓటమి తప్పలేదు.
మరోవైపు బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లామ్, షకీబుల్ హసన్, ముస్తఫిజుర్ రెహమాన్ తలో వికెట్ తీశారు. బంగ్లా బౌలర్లలో ముఖ్యంగా ముస్తఫిజుర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన ముస్తఫిజుర్ కేవలం 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇది టీ20ల్లో అతనికి 100వ వికెట్ కావడం కూడా విశేషం. ఇంతకుముందు 2 టీ20లు కూడా గెలిచిన బంగ్లాదేశ్.. ఈ మ్యాచ్ కూడా గెలవడంతో సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయగలిగింది.
BANGLADESH SWEEP THE T20 WORLD CHAMPIONS 3-0! ?? #BANvENG pic.twitter.com/qGXGN54x2D
— ESPNcricinfo (@ESPNcricinfo) March 14, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..