T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ vs బంగ్లాదేశ్‌ టీ 20 సిరీస్.. షెడ్యూల్ ఇదిగో

|

Apr 04, 2024 | 8:01 AM

ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. మార్చి 22 నుంచి పోటీలు ప్రారంభమయ్యాయి. మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత వెస్టిండీస్, యూఎస్ఏల్లో టీ20 ప్రపంచకప్ టోర్నీని నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ vs బంగ్లాదేశ్‌ టీ 20 సిరీస్.. షెడ్యూల్ ఇదిగో
T20 World Cup 2024
Follow us on

ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. మార్చి 22 నుంచి పోటీలు ప్రారంభమయ్యాయి. మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత వెస్టిండీస్, యూఎస్ఏల్లో టీ20 ప్రపంచకప్ టోర్నీని నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇంతలో, ఒక ప్రధాన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ కు ముందు టీ20 సిరీస్‌ని టీమిండియా ఆడనుంది. టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. అయితే అది పురుషుల జట్టు కాదు భారత మహిళల జట్టు. క్రికెట్ ప్రపంచంలో పురుషులతో పాటు మహిళల టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జరగనుంది. టీ20 మహిళల ప్రపంచకప్ బంగ్లాదేశ్‌లో జరగనుంది. ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. తాజాగా ఈ టీ20 సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఐసీసీ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ కు టీమిండియాకు ఈ సిరీస్ ప్రయోజనకరంగానూ ఉంటుంది. బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా మహిళల టీ20 సిరీస్ ఏప్రిల్ 28 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నరాఉ. టూర్‌కు 5 రోజుల ముందు అంటే ఏప్రిల్ 23న టీమ్ ఇండియా బంగ్లాదేశ్ చేరుకుంటుంది. మే 10న పర్యటన ముగించుకుని మహిళల జట్టు భారత్‌కు తిరిగి రానుంది.

బంగ్లాదేశ్ vs భారత్ టీ20 సిరీస్ షెడ్యూల్

ఇవి కూడా చదవండి
  • మొదటి మ్యాచ్, 28 ఏప్రిల్,
  • రెండవ మ్యాచ్, 30 ఏప్రిల్,
  • మూడవ మ్యాచ్, మే2వ తేదీ,
  • నాలుగో మ్యాచ్, మే6వ తేదీ
  • ఐదవ మ్యాచ్, మే9వ తేదీల్లో జరుగుతాయి.

కాగా, గత బంగ్లాదేశ్ టూర్‌లో మహిళల జట్టు భారత్ సిరీస్ గెలవలేకపోయింది. ఆ తర్వాత టీమ్ ఇండియా సిరీస్‌ను సమం చేసింది. ఉమెన్స్ టీమ్ ఇండియా వర్సెస్ ఉమెన్స్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 13 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచుల్లో 11 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

ఐసీసీ ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..