పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో యువ బ్యాటర్లు వీరవిహారం చేస్తున్నారు. ఆకాశమే హద్దుగా బౌండరీలతో చెలరేగిపోతున్నారు. ఇటీవల పెషావర్ జాల్మి, లాహోర్ క్వాలండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బాబర్ అజామ్ అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. అతడి ఇన్నింగ్స్‌ను ఫేడ్-ఔట్ చేస్తూ ఓ 20 ఏళ్ల బ్యాట్స్‌మెన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. రావల్పిండిలో జరిగిన ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ జట్టు 207 పరుగులు చేసింది.
ఆ జట్టు ఓపెనర్ సైమ్ అయ్యూబ్ 36 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 188 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో తన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. మరోవైపు పెషావర్ కెప్టెన్ బాబర్ అజామ్ 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్‌కు బాబర్, సైమ్ కలిసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అటు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ ఇన్నాళ్లకు తన బౌలింగ్‌లో బాబర్ అజామ్ వికెట్‌ను పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. లాహోర్ క్వాలండర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది మ్యాజిక్ చేశాడు. బౌలింగ్‌లో షాహీన్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి.. అటు బ్యాటింగ్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అలాగే హుస్సేన్ తలత్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు బాదేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత పెషావర్ జట్టు 207 పరుగులు చేయగా.. అందుకు సమాధానంగా లాహోర్ నిర్ణీత ఓవర్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పెషావర్ 35 పరుగులు తేడాతో విజయం సాధించింది.
All class! #HBLPSL8 | #SabSitarayHumaray | #PZvLQ pic.twitter.com/oa4YeUWCWW
— PakistanSuperLeague (@thePSLt20) March 7, 2023
Rauf got the Skipper… finally! #HBLPSL8 | #SabSitarayHumaray | #PZvLQ pic.twitter.com/ICRzcj7ywU
— PakistanSuperLeague (@thePSLt20) March 7, 2023