Azharuddin : జరిగితే అన్నీ జరగాలి, లేదంటే ఏదీ వద్దు.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై మాజీ భారత కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

ఏషియా కప్ 2025 లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపై మాజీ భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "జరిగితే అంతా జరగాలి, లేదంటే ఏదీ వద్దు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడే అవకాశం ఉంది.

Azharuddin : జరిగితే అన్నీ జరగాలి, లేదంటే ఏదీ వద్దు.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై మాజీ భారత కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
India Vs Pakistan

Updated on: Jul 27, 2025 | 11:51 AM

Azharuddin : ఆసియా కప్ 2025 షెడ్యూల్ ప్రకటించారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‎లో జరుగుతుంది. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అంటే, కనీసం ఒక మ్యాచ్ అయినా ఈ రెండు జట్ల మధ్య జరుగుతుంది. ఒకవేళ పెద్దగా ఏమైనా ఆశ్చర్యకర సంఘటనలు జరగకపోతే సూపర్ 4లో రెండో మ్యాచ్ కూడా ఆడవచ్చు. ఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలా మొత్తంగా ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌లు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహ్మద్ అజారుద్దీన్ మీడియా మాట్లాడుతూ, భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై.. జరిగితే అన్నీ జరగాలి.. లేదంటే ఏదీ జరుగకూడదని అన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై తీవ్రమైన కోపం ఉంది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‎లో భారత మాజీ ఆటగాళ్లు పాక్‌తో ఆడటానికి నిరాకరించడంతో వారి మధ్య మ్యాచ్ రద్దు అయ్యింది. అయితే, అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ రెండు జట్లు ఒకదానికొకటి తలపడటానికి సిద్ధంగా ఉన్నాయి.

ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు, పాకిస్థాన్ జట్టు ఒకే గ్రూప్‌లో ఉండడం గురించి అజారుద్దీన్‎ను అడిగినప్పుడు.. ఇది ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్, కాబట్టి నేను దీనిపై ఏమీ మాట్లాడలేను. కానీ నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను – ఒకవేళ మ్యాచ్‌లు జరుగుతుంటే అన్నీ జరగాలి, లేకపోతే ఏదీ జరగకూడదు. మీరు ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోతే, అంతర్జాతీయ ఈవెంట్లు కూడా ఆడకూడదు. ఇది తన అభిప్రాయమని కానీ ప్రభుత్వం, బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుందన్నారు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు కావడంపై కూడా ఆయన స్పందించారు.. “ఇది బోర్డుకు సంబంధించిన విషయం, ఎందుకంటే లెజెండ్స్ టోర్నమెంట్ అధికారికంగా జరగదు. అది ICC లేదా ACC టోర్నమెంట్ కాదు. కానీ ఆసియా కప్ ACC, బోర్డు ఈవెంట్, కాబట్టి వారు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు.” అని అన్నారు.

ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు ఆడతాయి, ఒక్కోగ్రూపులో నాలుగు జట్ల చొప్పున వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ స్టేజ్ తర్వాత రెండు గ్రూపుల నుండి టాప్ 2 జట్లు సూపర్ 4లో చేరుతాయి, మిగిలిన జట్లు బయటపడతాయి. భారత్‌తో పాటు గ్రూప్ Aలో ఒమన్, యూఏఈ ఉన్నాయి. కాబట్టి, సూపర్ 4లో కూడా భారత్, పాకిస్థాన్ తలపడే ఛాన్స్ ఉంది. రెండు జట్లు ఆసియాలో బలమైనవి కాబట్టి, ఫైనల్‌లో కూడా టైటిల్ కోసం ఇవి తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..