
ఐసీసీ టోర్నమెంట్స్ అంటేనే ఆస్ట్రేలియాకు పూనకం వచ్చేస్తుంది. మరే దేశం కంటే.. ఆస్ట్రేలియా జట్టుకే ఐసీసీ ట్రోఫీలు ఎక్కువ. ఐసీసీ టోర్నమెంట్ వచ్చిందంటే చాలు.. ఆ జట్టు ఆటతీరు డిఫెరెంట్‌గా ఉంటుంది. అయితే, మెగా టోర్నీల ముందు సిరీస్‌లలో ఓటమి పాలవ్వడం ఆసీస్ జట్టు స్పెషాలిటీ అని చెప్పొచ్చు. చరిత్రను చూసుకుంటే.. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓడిపోయినప్పుడల్లా తన బలహీనతను బయటపెట్టకుండా.. రాబోయే ఐసీసీ టోర్నీకి వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యూహానికి నిదర్శనంగా గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. 2007 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్‌లకు ముందు ఆస్ట్రేలియా కీలక సిరీస్‌లను కోల్పోయింది. ఆటగాళ్ల ఫామ్‌పై విమర్శలు, సందేహాలు వ్యక్తమైనప్పటికీ, ప్రతిసారీ వరల్డ్‌కప్ వచ్చేసరికి ఆసీస్ జట్టు అద్భుతంగా పుంజుకుని ట్రోఫీలను కైవసం చేసుకుంది. తమ అనుభవం, మెంటల్ స్ట్రెంగ్త్‌తో ప్రత్యర్థులను దెబ్బతీసి ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఇప్పుడు, మరో రెండు రోజుల్లో 2026 టీ20 వరల్డ్‌కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ముందుగా ఆస్ట్రేలియా మరోసారి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఒకే ప్రశ్న తలెత్తింది. “ఈసారి కూడా అదే చరిత్ర పునరావృతమవుతుందా?” ఆస్ట్రేలియా చరిత్రను గమనిస్తే, సిరీస్‌లో ఓటమిపాలవ్వడం బలహీనతగా కాకుండా, మెగా టోర్నీ కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోందని చాలామందిలో ఇదే సమాధానం బలంగా ఉంది. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో ఈ మ్యాజిక్ పునరావృతమవుతుందా లేదా వేచి చూడాలి.
ఇది చదవండి: ఎంత పని చేశావ్ హల్క్.! ఆడుకుంటుండగా నోట్లోంచి రాని మాట.. ఎక్స్‌రే తీసి కంగుతిన్న డాక్టర్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి