IPL 2021: ఐపీఎల్ సెకండాఫ్‌లో సన్‌రైజర్స్‌కు భారీ షాక్.! జట్టుకు వార్నర్ దూరం.?

Australian Players Pull Out IPL 2021: ఐపీఎల్ ఫస్టాఫ్‌లో వరుస పరాజయాలు ఎదుర్కున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సెకండాఫ్‌లో కూడా...

IPL 2021: ఐపీఎల్ సెకండాఫ్‌లో సన్‌రైజర్స్‌కు భారీ షాక్.! జట్టుకు వార్నర్ దూరం.?
David Warner

Updated on: May 27, 2021 | 5:23 PM

Australian Players Pull Out IPL 2021: ఐపీఎల్ ఫస్టాఫ్‌లో వరుస పరాజయాలు ఎదుర్కున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సెకండాఫ్‌లో కూడా భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మిగిలిన టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మిగిలిన 31 మ్యాచ్‌లకు మొత్తం ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం కానున్నారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆగష్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆసీస్ ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు అయిపోతాయి.

మరోవైపు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలకు 13 మంది ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా కూడా లీగ్‌కు దూరమైతే ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పటికే చాలామంది స్టార్ ఆటగాళ్లు గాయాలు కారణంగా దూరం కాగా, ఇప్పుడు ఆసీస్ ప్లేయర్స్ కూడా అందుబాటులో లేకపోతే టోర్నీ పున: ప్రారంభించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిచెస్ట్ బోర్డు బీసీసీఐ.. ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ పర్యటనను రద్దు అయ్యేలా చూస్తుందని పలువురు ఫ్రాంచైజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!