Meg Lanning: ‘ఢిల్లీ కాపిటల్స్‌’ను నడిపించనున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. ఆసీస్‌కు 4 టీ20 ప్రపంచకప్‌లు ఆమె సారథ్యంలోనే..

|

Mar 03, 2023 | 9:55 AM

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మెగ్‌ లాన్నింగ్‌కు తిరుగులేదు. ఆమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. ఈ మధ్యే..

Meg Lanning: ‘ఢిల్లీ కాపిటల్స్‌’ను నడిపించనున్న ఆస్ట్రేలియా కెప్టెన్.. ఆసీస్‌కు 4 టీ20 ప్రపంచకప్‌లు ఆమె సారథ్యంలోనే..
Australia And Delhi Capitals Captain Meg Lanning
Follow us on

మహిళల ప్రీమియర్‌ లీగ్ మొదటి సీజన్‌లో ఢిల్లీ కాపిటల్స్‌ను ఆసీస్ క్రికెటర్ మెగ్‌ లాన్నింగ్‌ నడిపించనుంది. ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయాలు అందించినమెగ్‌ లాన్నింగ్‌కే కాపిటల్స్ మేనేజ్‌మెంట్ నాయకత్వ పగ్గాలను అందించింది. మరోవైపు టీమిండియా యువ క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ను కాపిటల్స్ జట్టు డిప్యూటీగా ఎంపిక చేసింది. అయితే అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మెగ్‌ లాన్నింగ్‌కు తిరుగులేదు. ఆమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. ఈ మధ్యే దక్షిణాఫ్రికాలో ఆతిథ్య జట్టుతో జరిగిన ఫైనల్లో గెలిచి తన జట్టుకు ఆరో ప్రపంచకప్‌ను అందించింది. ఇక అంతకముందు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆమెను ఢిల్లీ జట్టు 1.1 కోట్లకు తమ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఆమె ముంబైకి చేరుకొని ఢిల్లీ శిబిరంలో టీమ్ మేనేజ్‌మెంట్‌ను కలిసింది.

అయితే ఇప్పటి వరకు 132 టీ20లు ఆడిన లాన్నింగ్‌ 36.61 సగటు, 116.7 స్ట్రైక్‌రేట్‌తో 3405 పరుగులు చేసింది.  ఇందులో 15 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాకు 100 టీ20ల్లో సారథ్యం వహించిన అనుభవం కూడా అమెకు ఉండడం విశేషం. ఢిల్లీ మేనెజ్‌మెంట్ తనను ఆ జట్టుకు కెప్టెన్‌గా నియమించిన సందర్భంగా లాన్నింగ్ మాట్లాడుతూ..  ‘నేనిది గర్వపడే సందర్భం. మొదట దిల్లీ క్యాపిటల్స్‌లో చేరాను. ఇప్పుడు జట్టును నడిపించబోతున్నాను. ఆటను ఆస్వాదిస్తూ అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకురావడమే ముఖ్యం. క్రీడారంగంలో డబ్ల్యూపీఎల్‌ ఓ గొప్ప ముందడుగు. ఇదెంతో తెలివైన చర్య. భారత ప్రజల మనసుల్లో క్రికెట్‌ జీవిస్తోంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ను వారు కచ్చితంగా ఆదరిస్తారు. ఇలాంటి లీగ్‌లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఈ లీగ్ మరింత ఎదుగుతుంది’ అని మెగ్‌ లాన్నింగ్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..