IND vs AUS: భారత్-పాక్‌‌లతో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే.. డేంజరస్ బ్యాటర్‌ రీఎంట్రీ..

|

Oct 15, 2024 | 9:15 AM

Australia Cricket Team: వచ్చే నెల 14న పాకిస్థాన్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) జట్టును ప్రకటించింది. ఒత్తిడిలో ఉన్న సెలక్టర్లు కొన్ని మార్పులు చేశారు. 35 ఏళ్ల ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ తిరిగి వచ్చాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేడు. కానీ, కెమెరూన్ గ్రీన్ గాయం కారణంగా, అతనికి అవకాశం ఇచ్చారు.

IND vs AUS: భారత్-పాక్‌‌లతో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే.. డేంజరస్ బ్యాటర్‌ రీఎంట్రీ..
Ind Vs Aus
Follow us on

Australia Cricket Team: వచ్చే నెల 14న పాకిస్థాన్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) జట్టును ప్రకటించింది. ఒత్తిడిలో ఉన్న సెలక్టర్లు కొన్ని మార్పులు చేశారు. 35 ఏళ్ల ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ తిరిగి వచ్చాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేడు. కానీ, కెమెరూన్ గ్రీన్ గాయం కారణంగా, అతనికి అవకాశం ఇచ్చారు. స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, తుఫాన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌లకు వన్డే జట్టులో చోటు దక్కలేదు.

సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్..

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కారీకి కూడా ఈ సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇంగ్లండ్‌పై ఈ ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మాకు ఇది చివరి వన్డే సిరీస్. జట్టు బ్యాలెన్స్ దీనిపై దృష్టి సారించింది. UKలో వన్డే జట్టు మంచి ప్రదర్శన చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాలో 3 వన్డే మ్యాచ్‌లు..

వన్డే సిరీస్‌లో మార్ష్, హెడ్ లేకపోవడంతో ఓపెనింగ్ స్థానానికి జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌లకు అవకాశం ఉంది. ఫ్రేజర్-మెక్‌గర్క్ తన భాగస్వామి మాథ్యూ షార్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ఆరోన్ హార్డీ జట్టులోని మరో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. నవంబర్ 4న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మిగిలిన రెండు వన్డేలు నవంబర్ 8, 10 తేదీల్లో అడిలైడ్ ఓవల్, పెర్త్ స్టేడియంలో జరుగుతాయి. ఈ సిరీస్‌కు టీ20 జట్టును ఈ నెలాఖరులో ప్రకటిస్తారు.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్మిత్, మచెల్, ఆడమ్ జాంపా.

భారత్‌తో జరిగే మ్యాచ్‌కి జట్టు ఇదే..

పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌తో పాటు భారత్-ఎతో జరిగే మ్యాచ్‌కు ఆస్ట్రేలియా ఎ జట్టును ప్రకటించారు. మార్కస్ హారిస్, యువ సంచలనం సామ్ కాన్స్టాస్‌లతో పాటు కెమెరూన్ బాన్‌క్రాఫ్ట్‌కు అవకాశం కల్పించారు. ఆస్ట్రేలియా ఎ జట్టు భారత్ ఎ జట్టుతో 2 మ్యాచ్‌లు ఆడనుంది. ఆఫ్ స్పిన్నర్ కోరీ రోచియోలీకి ఈ స్థాయిలో తొలి అవకాశం లభించింది. ఎ సిరీస్‌లో సెలెక్టర్లను ఆకట్టుకునేలా ఆల్‌రౌండర్లు మైఖేల్ నేజర్, బ్యూ వెబ్‌స్టర్‌లకు అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 31 నుంచి ఆస్ట్రేలియా ఎ జట్టుతో భారత్ ఎ జట్టు తొలి నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ నవంబర్ 7 నుంచి జరగనుంది.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎ జట్టు..

నాథన్ మెక్‌స్వీనీ, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్కాట్ బోలాండ్, జోర్డాన్ బకింగ్‌హామ్, కూపర్ కొన్నోలీ, ఒల్లీ డేవిస్, మార్కస్ హారిస్, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌ఆండ్రూ, మైఖేల్ నేజర్, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ’నీల్, జిమ్మీ పియర్సన్, జోష్ ఫిలిప్పీ, జోష్ ఫిలిప్పీట్, బ్యూ వెబ్‌స్టర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..