Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జెండరీ లెగ్‌స్పిన్నర్ 52 ఏళ్ల షేన్ వార్న్‌కు ఆదివారం రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. షేన్ వార్న్ తన కొడుకు జాక్సన్ వార్న్ తో కలిసి బైక్ వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయిందని సిడ్నీ మీడియా తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో వార్న్ తన కుమారుడు జాక్సన్‌తో కలిసి మెల్‌బౌర్న్ వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది.. షేన్ వార్న్ ప్రమాదం జరిగిన సమయంలో 300 కిలోల బరువు ఉన్న బైక్‌ను నడుపుతున్నాడు. అయితే షేన్ వార్న్ ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళలేదు. గాయాలు ఏమీ కనిపించలేదు. అయితే సోమవారం తీవ్రమైన నొప్పి కలగడంతో వెంటనే హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్ళాడు.
ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పై నుంచి అదుపు తప్పి కిందపడిపోయాడు. ఆలా సుమారు 15 కిలో మీటర్లు దూరం వరకూ దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే షేన్ వార్న్ కు నడుమ భాగం, పాదం, చీలమండల్లో తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇదే విషయాన్నీ వార్న్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. తనకు ‘ఇబ్బందిగా ఉండటం వల్లే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యా’ అని చెప్పాడు. షేన్ వార్న్.. డిసెంబర్ 8 నుంచి జరగనున్న యాషెస్ సిరీస్ కు కామెంటేటర్ గా వ్యవహరించాల్సి ఉంది. తాను త్వరగా కోలుకుని విధులకు సిద్ధంగా ఉంటానని వార్న్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Shane Warne has been left ‘battered and bruised’ after a motorcycle accident >>> https://t.co/CTrUIjnZgp
Get well soon, King. pic.twitter.com/UjsDDTmP7q
— Fox Cricket (@FoxCricket) November 28, 2021