
Olympics 2028: టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించడంతో, ఇప్పుడు 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో కూడా ఆ జట్టు పాల్గొనడం ప్రమాదంలో పడింది. టోర్నమెంట్‌కు ముందు కంగారూలను టైటిల్ ఫేవరెట్స్‌గా భావించినా, జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో వరల్డ్ కప్ నుంచి బయటపడ్డారు. ఈ పరాజయాల ప్రభావం ఒలింపిక్స్ 2028 (Olympics 2028) అర్హతపై పడే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం, ఆస్ట్రేలియాను ఒలింపిక్స్ నుంచి తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే భారత్‌కు ప్రత్యర్థిగా భావించే న్యూజిలాండ్ జట్టును రీప్లేస్ చేసే అవకాశాలు పెరిగాయి.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా నిరాశాజనకంగా ఆడింది. శ్రీలంకలో జరిగిన తమ అన్ని మ్యాచ్‌ల్లో కంగారూలు తొలుత జింబాబ్వే చేతిలో షాకింగ్ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో ఏకపక్షంగా ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
శ్రీలంకతో ఓడినప్పటికీ, జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఒక శాతం ఆశలు మిగిలాయి. కానీ, ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ఆ చిన్న ఆశ కూడా చిగురించకుండా ముగిసింది. దీంతో వరల్డ్ కప్ 2026 నుంచి బయటపడిన ఆస్ట్రేలియాకు, ఒలింపిక్స్ 2028కు వెళ్లే దారి కూడా కఠినంగా మారింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో నిష్క్రమణతో ఆస్ట్రేలియా టీ20 ర్యాంకింగ్స్‌లో భారీగా వెనుకబడే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌కు అర్హత నిర్ణయం వరల్డ్ కప్ ముగిసే సమయానికి ఉన్న ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా జరుగుతుంది.
ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్ సెమీఫైనల్ లేదా అంతకంటే ముందుకు వెళ్తే, ఆ జట్టు ర్యాంకింగ్ ఆస్ట్రేలియాను దాటే అవకాశం ఉంది. ఇప్పటికే కివీస్ సూపర్-8కు అర్హత సాధించింది. ఇప్పుడు లక్ష్యం సెమీఫైనల్ చేరడం లేదా అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా ఒలింపిక్స్ 2028కు టికెట్ ఖరారు చేసుకోవడం.
ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్‌కూ లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028లో ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఈసారి కేవలం 6 జట్లకే పరిమితం కానుంది. ఐసీసీ ప్రతి ఖండం నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసే విధానాన్ని అనుసరించనుంది.
ఆసియా ఖండం నుంచి భారత్ ఎంపిక కావడం దాదాపు ఖరారైనట్టే. అందువల్ల పాకిస్తాన్ ఒలింపిక్స్ కలలు చిదిరిపోయే అవకాశాలు ఎక్కువ. ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లాండ్ జట్లు ఒలింపిక్స్‌కు బలమైన అభ్యర్థులుగా కనిపిస్తున్నాయి. ఈ ఖండాల్లో వీటి కంటే మెరుగైన టీ20 ర్యాంకింగ్ మరే జట్టుకు లేదు.
అమెరికా (USA) ఒలింపిక్స్ 2028కు ఆతిథ్యం ఇవ్వనుండటంతో, హోస్ట్ నేషన్‌గా వారికి నేరుగా ఎంట్రీ లభించే అవకాశం ఉంది. ఆరో జట్టు గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా ఎంపిక చేయబడుతుంది. ఇందులో ర్యాంకింగ్స్ ద్వారా ఎంపిక కాని జట్లు పోటీపడతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..