ఆసీస్ ఓటమి.. సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌!

|

Jul 07, 2019 | 2:33 AM

మాంచెస్టర్: ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 10 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 315 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలబడనుండగా.. భారత్, న్యూజిలాండ్ మధ్య మరో సెమీస్ జరగనుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 325 పరుగులు చేసింది. సఫారీ […]

ఆసీస్ ఓటమి.. సెమీస్ ప్రత్యర్థి ఇంగ్లాండ్‌!
Follow us on

మాంచెస్టర్: ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 10 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 315 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలబడనుండగా.. భారత్, న్యూజిలాండ్ మధ్య మరో సెమీస్ జరగనుంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 325 పరుగులు చేసింది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ డుప్లెసిస్(100; 94 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), దుస్సేన్(95; 97బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లియోన్ రెండేసి వికెట్లు తీయగా.. బెహ్రన్డ్రఫ్ , కమిన్స్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో.. ఆ జట్టు 49.5 ఓవర్లకు 315 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ వార్నర్ ( 122), వికెట్ కీపర్ అలెక్స్ కారె(85)లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. అటు సఫారీ బౌలర్ రబడా మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.