ఐపీఎల్లో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ను విజయవంతంగా ముగించుకున్నారు. అంనంతరం వారు సోమవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత తమ కుటుంబాల్ని కలుసుకున్న ఆనందంలో భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబసభ్యులను కలిసి ఆనందంలో మునిగితేలారు.
ఆ సంతోషాన్ని పలు ఆసీస్ క్రికెటర్లు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ వార్నర్(David Warner) ఇంటికి చేరుకోగానే తన కూతుర్లను హత్తుకుని ఎంతో సంబరపడిపోయాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.
Welcome home @davidwarner31 what a movement for u champ #StayHomeStaySafe pic.twitter.com/e5cTfcr0vp
— David Warner Trends (@WarnerFanTrends) May 31, 2021
ఇంటికి రావడం సంతోషంగా ఉంది. ఒక చోట ఇరుక్కుపోవడం ఎప్పుడైనా కష్టంగానే ఉంటుంది అని పేస్ బౌలర్ జాసన్ బెహ్రండార్ఫ్ అన్నాడు. వీరితోపాటు స్టీవ్ స్మిత్(Steve Smith), పాట్ కమిన్స్(Cummins), గ్లెన్ మాక్స్వెల్(Glenn Maxwell), జే రిచర్డ్సన్ ఇంకా మరికొందరు ఆటగాళ్లు వారి ఇళ్లకు చేరుకున్నారు.
Video of the day! After eight weeks away for the IPL, Pat Cummins finally leaves hotel quarantine and reunites with his pregnant partner Becky. All the feels! pic.twitter.com/YA3j98zJId
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) May 31, 2021